పౌరసత్వ సవరణ బిల్లుతో ముస్లీంలకు ఇబ్బందిలేదు : లక్ష్మణ్

పౌరసత్వ సవరణ బిల్లుతో ముస్లీంలకు ఇబ్బందిలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఈ బిల్లుతో మైనారిటీ హక్కులకు ఎలాంటి భగం కలగదన్నారు.

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 08:21 AM IST
పౌరసత్వ సవరణ బిల్లుతో ముస్లీంలకు ఇబ్బందిలేదు : లక్ష్మణ్

పౌరసత్వ సవరణ బిల్లుతో ముస్లీంలకు ఇబ్బందిలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఈ బిల్లుతో మైనారిటీ హక్కులకు ఎలాంటి భగం కలగదన్నారు.

పౌరసత్వ సవరణ బిల్లుతో ముస్లీంలకు ఇబ్బందిలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఈ బిల్లుతో మైనారిటీ హక్కులకు ఎలాంటి భగం కలగదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సబబే అని అన్నారు. సహజ రీతిలో ఉన్న పౌరసత్వ చట్టానికి పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకం కాదన్నారు. పౌరసత్వానికి వ్యక్తిగతంగా పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి వారికి పౌరసత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు. బిల్లును అర్థం చేసుకోకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పౌరసత్వ సవరణ బిల్లుపై పనికిమాలిన లొల్లి చేస్తున్నాయని విమర్శించారు.

భారతదేశంలో 11 సంవత్సరాలు నివసిస్తే పౌరసత్వం దక్కించుకునే వెసులుబాటు ఇప్పటికీ 1950 చట్టం ద్వారా ఇది కొనసాగుతుందన్నారు. దానికి కులం, మతం లేదన్నారు. అయినా మతవాదం, ముస్లీం పక్షవాదంతో కళ్లుమూసుకుపోయిన కాంగ్రెస్, టీఆర్ ఎస్ లు వామపక్షవాదులు కనీస ఆలోచన లేకుండా ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని విమర్శించారు. పోరుగుదేశాల్లో అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగి, ఆస్తులు లాగేసుకుని దాడులు చేస్తే ప్రాణభీతితో మనదేశానికి వచ్చి ఐదేళ్లకు పైగా స్థిరపడిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శులైనా వారికి పౌరసత్వం కల్పించేందుకు దోహదపడే బిల్లు.. పౌరసత్వ సవరణ బిల్లు అని అన్నారు. 

దేశ ప్రజలకు ఉపయోగపడే పౌరసత్వ సవరణ బిల్లు, 370 ఆర్టికల్ రద్దు, త్రిబుల్ తలాక్ బిల్లులతో దూసుకుపోతున్న మోడీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నారు తప్పిచే ఏమాత్రం పసలేదన్నారు. ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ, షాలను ఎవరూ నిలువరించే పరిస్థితిలేరని చెప్పారు. దేశ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా దేశ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని తీసుకుంటున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 

భారతదేశ విభజన జరిగినప్పుడు కొంతమంది ముస్లీంలు పాకిస్తాన్ నుంచి భారతదేశంలోకి వచ్చారని తెలిపారు. కొంతమంది హిందువులు భారత దేశం నుంచి వెల్ళిపోయారని తెలిపారు. దేశ విభజన సమయంలో ఇండియా వచ్చిన ముస్లీంలు ఇక్కడ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. వారి బతుకులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు హక్కులు కల్పించారని తెలిపారు.
  
మైనారిటీలైన ముస్లీంలు భారతంలో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అయ్యారని, ఉన్నత పదువులు అనుభవించారని తెలిపారు. వారికి పూర్తిస్థాయిలో భద్రత, హక్కులు కల్పించారని తెలిపారు. కానీ పాకిస్తాన్ వెళ్లిన హిందువులు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారని, వారి ఆస్తులు లాక్కొన్నారని, వారి ప్రాణాలు తీశారని, మిగిలిన వారు ప్రాణాలు చేతిలో పెట్టుకుని బతుకు జీవుడా అని భారత్ కు వస్తున్నారని అన్నారు. ఏ ఒక్క హిందువు అయినా ఆ దేశంలో ప్రధాని, రాఫ్ట్రపతి అయ్యారని ప్రశ్నించారు.

పౌరసత్వ సవరణ బిల్లుతో ముస్లీంలకు వచ్చే ఇబ్బందేమీ లేదన్నారు. ఈ బిల్లుతో భారతీయులకు, ఇక్కడుంటే ముస్లీంలకు సంబంధం లేదన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి వచ్చిన శరణార్థులు భారతదేశంలో 11 సంవత్సాలు నివసించి పౌరసత్వం ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే..వారికి పౌరసత్వం ఇవ్వాలని 1950 లో కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టం చేసిందన్నారు. అది ఇప్పటికీ అమలులో ఉందని..దాని ప్రకారం ముస్లీంలకు కూడా పౌరసత్వం ఇచ్చే అవకాశముందని చెప్పారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం ఇవ్వాలని నాడు మహాత్మ గాంధీ చెప్పారని తెలిపారు. కానీ పౌరసత్వ సవరణ చట్టం విషయంలో మత వివక్ష అనే విష ప్రచారం చేసి ముస్లీంలలో వ్యతిరేకత పెంచి రాజకీయ పబ్బం గడపాలన్న కాంగ్రెస్, టీఆర్ఎస్ నైజాన్ని బహిర్గతం చేస్తామని చెప్పారు. పౌరసత్వ సవరణ బిల్లు పేరుతో ప్రజలను చైతన్యం చేస్తామని చెప్పారు.