నుమాయిష్ అగ్నిప్రమాదం : సేవలందించిన మెట్రో 

  • Published By: veegamteam ,Published On : January 31, 2019 / 03:44 AM IST
నుమాయిష్ అగ్నిప్రమాదం : సేవలందించిన మెట్రో 

హైదరాబాద్‌ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ భారీ అగ్నిప్రమాదం ఘటనలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రతీ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘నుమాయిష్’లో బుధవారం (జనవరి30 ) రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎగ్జిబిషన్ రద్దీగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో తీవ్ర భయభ్రాంతులకు లోనైన విజిటర్స్ ప్రాణాలు వారు దక్కించుకునేందుకు అందరు ఒక్కసారిగా బయటకు వచ్చేయటంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ పరిస్థితిలో మెట్రో అధికారులు వెంటనే స్పందించారు.  విజిటర్స్ ను అతి త్వరగా బైటకు పంపించేయాలనే ఉద్ధేశంతో నాంపల్లి నుంచి ఎల్బీ నగర్ వరకు ఐదు ప్రత్యేక సర్వీసులను హైదరాబాద్ మెట్రో రైల్ నడిపింది. వారందరికీ  టికెట్ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. అంతేకాదు అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. 
 

ఇదిలా వుండగా వందలాది  స్టాల్స్  మంటల్లో కాలిబూడిదయ్యాయి. రూ. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో దేశం నలుమూలల నుంచి వచ్చిన పలువురు వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నాలుగు రాళ్లు వెనకేసుకుందామని వస్తే.. అగ్ని ప్రమాదం తీరని నష్టాన్ని మిగిల్చిందని మీడియా ముందు కంటతడి పెడుతున్నారు. కోట్లాది రూపాలయ సంపద కాలి బూడిదైందని..పొట్ట చేతపట్టుకొని వచ్చి పిల్లలతో సహా వీధిన పడ్డామని..ఎగ్జిబిషన్ ముగుస్తున్న సమయంలో కొద్దో గొప్పో సంపాదించుకున్న డబ్బుతో సంతోషంగా ఇంటికి వెళ్లిపోతామనుకునే సమయంలో సంభవించిన ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా నష్టపోవటంతో పాటు ఖాళీ చేతులతో వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.