నుమాయిష్‌లో మంటలు : దిగ్ర్భాంతి కలిగించే వాస్తవాలు

  • Published By: madhu ,Published On : January 31, 2019 / 08:00 AM IST
నుమాయిష్‌లో మంటలు : దిగ్ర్భాంతి కలిగించే వాస్తవాలు

హైదరాబాద్ : నుమాయిష్‌లో ఫైర్ ఆక్సిడెంట్ జరిగిన తరువాత షాకింగ్ తెప్పించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. నియమనిబంధనలు పాటించలేదని…ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొన్ని దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటే…పరిమితికి మించిన స్టాల్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు…షాప్స్ ఏర్పాటు చేసే వారికి ఇన్సూరెన్స్ కల్పించాల్సి ఉంటుంది..అయితే అలాంటిది ఏమీ కల్పించలేదు. ఇన్సూరెన్స్ కల్పించకపోవడం వల్ల నష్టపోయిన వ్యాపారులు పరిహారాన్ని పొందలేకపోతున్నారు. స్టాళ్లు మాత్రం పెట్టుకొనేందుకు భారీగానే వసూలు చేసినట్లు టాక్.

2500 స్టాళ్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. చివరకు అమ్మవారి విగ్రహంపైన కూడా స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మంటలకు గుడిలోని ఫొటోలు మంటలకు కాలిపోయి ఉండి కనిపించాయి. అంటే..గుడి కనిపించకుండా స్టాల్ ఏర్పాటు చేశారని కొంతమంది అంటున్నారు. ఎంత కక్కుర్తి పడ్డారో దీనిని బట్టి అర్థమౌతుందని కొంతమంది అంటుంటే…అలాంటిది ఏమీ లేదని సొసైటీ వారు కొట్టిపారేస్తున్నారు. ప్రమాదంలో నష్టపోయిన వారిని ఆదుకుంటామని సొసైటీ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఈటెల ప్రకటించారు. 

జనవరి 30వ తేదీ బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో వందల దుకాణాలు అగ్గికి ఆహుతి కాగా..సుమారు రూ. 50 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఎన్నో రాష్ట్రాల నుండి ఇక్కడకు వచ్చి స్టాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. వారిలో కొంతమంది తీవ్రంగా లాస్ అయిపోయారు. వ్యాపారస్తులు కూడా సొసైటీనే కారణమంటూ వేలెత్తి చూపుతున్నారు. లక్షలాది రూపాయలు నష్టపోయామని..తాము ఎలా బతకాలంటూ వారు కన్నీళ్లపర్యంతమౌతున్నారు. తమను ఎలాగైనా ఆదుకోవాలంటున్నారు. నుమాయిష్‌లో జరిగిన ప్రమాదంపై మాత్రం తీవ్ర విమర్శలు..ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రధానంగా బీజేపీ దీనిని టార్గెట్ చేసింది. పలు ఆరోపణలు గుప్పించింది. సొసైటీలో అక్రమాలు జరిగాయని..నష్టపోయిన వారిని ఆదుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.