ఎగ్జిబిషన్ 3 రోజులు క్లోజ్ : న్యాయం చేస్తాం – ఈటెల

  • Published By: madhu ,Published On : January 31, 2019 / 07:15 AM IST
ఎగ్జిబిషన్ 3 రోజులు క్లోజ్ : న్యాయం చేస్తాం – ఈటెల

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్‌ను టెంపరరీగా క్లోజ్ చేయనున్నారు. భారీ అగ్నిప్రమాదం జరగడంతో…ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి..అలాగే ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై తెలుసుకొనేందుకు మూసివేయనున్నారు. కేవలం మూడు రోజులు మాత్రమే తాత్కాలికంగా మూసివేస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఈటెల రాజేందర్ ప్రకటించారు.
ఎగ్జిబిషన్‌లో ప్రమాదం జరగడం పట్ల ఈటెల బాధను వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగవద్దని..మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు ఈటెల. ప్రస్తు పరిస్థితుల్లో జనవరి 31వ తేదీ నుండి 3 రోజుల పాటు బంద్ చేయనున్నట్లు తెలిపారు.

జనవరి 30వ తేదీ బుధవారం రాత్రి జరిగిన ప్రమాదం..నష్టపోయిన వ్యాపారులకు ఎలాంటి నష్టపరిహారం..తదితర విషయాలపై చర్చించేందుకు కమిటీ.., ఈటెలతో జనవరి 31వ తేదీ గురువారం సమావేశమైంది. అనంతరం ఈటెల మీడియాతో మాట్లాడారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల మాత్రం జరగలేదని..ఎవరైనా సిగరేట్ తాగి పడేయడం…కిరోసిన్ స్టవ్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. 

ఎగ్జిబిషన్‌కు ఎంతో పేరు ఉందని..ఇక్కడకు వచ్చి వ్యాపారం చేసే వారు తమ కుటుంబసభ్యులుగా పరిగణిస్తామన్నారు. వారికి మేలు జరిగే విధంగా న్యాయం చేస్తామని…నష్టపోయిన వారిని ఆదుకుంటామని ఈటెల హామీనిచ్చారు. ఈ విషయంలో నేరుగా వ్యాపారులతో ఇంటరాక్ట్ అయి..సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. సకాలంలో మంటలను ఆర్పలేకపోయినట్లు…అయితే..ప్రాణనష్టం వాటిల్లకుండా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.  దీనిపై రాజకీయంగా….వేరే రకంగా మాట్లాడవద్దని సూచించారు. భవిష్యత్‌లో ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించిన ఈటెల….ఎగ్జిబిషన్ సొసైటీలో అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. విద్యా సంస్థలకు, పేద పిల్లలకు సొసైటీ ఖర్చు పెడుతోందన్నారు. తల్లి..తండ్రి లేని పిల్లలకు ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని సొసైటీ యోచిస్తోందని…ప్రతిదీ పారదర్శకంగా జరుగుతుందని ఈటెల తెలిపారు.