హెరిటేజ్ లో ఉల్లి ధరలు : సీఎం జగన్ కు చంద్రబాబు భార్య కౌంటర్

చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ ఫ్రెష్ లో ఉల్లి ధరలపై సీఎం జగన్, మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే హెరిటేజ్ ఫ్రెష్ తో తమకు సంబంధం లేదని చంద్రబాబు

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 07:00 AM IST
హెరిటేజ్ లో ఉల్లి ధరలు : సీఎం జగన్ కు చంద్రబాబు భార్య కౌంటర్

చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ ఫ్రెష్ లో ఉల్లి ధరలపై సీఎం జగన్, మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే హెరిటేజ్ ఫ్రెష్ తో తమకు సంబంధం లేదని చంద్రబాబు

చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ ఫ్రెష్ లో ఉల్లి ధరలపై సీఎం జగన్, మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే హెరిటేజ్ ఫ్రెష్ తో తమకు సంబంధం లేదని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి సైతం జగన్ కు కౌంటర్ ఇచ్చారు. హెరిటేజ్ ఫ్రెష్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని భువనేశ్వరి స్పష్టం చేశారు. హెరిటేజ్ ఫ్రెష్.. చంద్రబాబు కంపెనీ అంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారామె. హెరిటేజ్ తమ నియంత్రణలో లేదని, ఫ్యూచర్ గ్రూప్ నియంత్రణలో ఉందని వెల్లడించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి… పెరిగిపోతున్న ఉల్లి ధరలపై స్పందించారు. కిలో ఉల్లి రూ. 120పైగా అమ్ముతున్నారని.. దీంతో పేద, దిగువ, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సాధారణ గృహిణిగా తాను కూడా ఇబ్బంది పడుతున్నానని.. ఉల్లి ధరలు పెరగడాన్ని సమర్థించడం లేదన్నారు. ఉల్లి ధరలు ఇంతలా పెరగడం తన జీవితంలో చూడలేదన్నారు. ఉల్లి ధరలు తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

సోమవారం(డిసెంబర్ 9,2019) అసెంబ్లీలో ఉల్లి ధరలపై చర్చ సందర్భంగా హెరిటేజ్‌లో కిలో ఉల్లిపాయలను రూ. 200 రూపాయలకు అమ్ముతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ఇందుకు కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు… హెరిటేజ్ ప్రెష్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని… అది ఫ్యూచర్ గ్రూప్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. కేవలం హెరిటేజ్ ఫుడ్స్ మాత్రమే తమదని.. అదికూడా తెలియకుండా విమర్శలు ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఏపీ సీఎం, మంత్రులు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు భార్య కూడా కౌంటర్ ఇచ్చారు.