తెలంగాణ షార్ట్ ఫిలింకు నేషనల్ అవార్డు

  • Published By: veegamteam ,Published On : November 17, 2019 / 03:14 AM IST
తెలంగాణ షార్ట్ ఫిలింకు నేషనల్  అవార్డు

తెలంగాణ గ్రామీణ ప్రాంత ఇతివృత్తంగా రూపొందించిన షార్ట్ ఫిలిం ‘సమ్మర్ రాప్సోడీ’ నేషనల్ అవార్డును గెలుచుకుంది. నవంబర్ 8 నుంచి 15 వరకు జరిగిన కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బెస్ట్ షార్ట్ ఫిలింగా   ‘సమ్మర్ రాప్సోడీ’  గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును  సొంతం చేసుకుంది. వారంపాటు ప్రదర్శించిన పలు షార్ట్‌ఫిలింలలో ది బెస్ట్ గా నిలిచింది. కోల్‌కతాలో జరిగిన ఈ  అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ముగింపు వేడుకలకు పశ్చిమబెంగాల్ సీఎం  మమతా బెనర్జీ హాజరై అవార్డులు అందజేశారు.

ఈ ఉత్సవాల్లో ఉత్తమ భారతీయ షార్ట్ ఫిలింగా తెలంగాణకు చెందిన శ్రవణ్ కటికనేని రూపొందించిన ‘సమ్మర్ రాప్సోడీ’ రూ.ఐదు లక్షల నగదు పురస్కారం, గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును మమతాబెనర్జీ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్బంగా శవణ్ మాట్లాడుతూ..‘సమ్మర్ రాప్సోడీ’ చిత్రానికి అవార్డు రావటం చాలా ఆనందంగా ఉందనీ..ఇదొక గొప్ప అనుభవమనీ అన్నారు. ఈ అవార్ట్ షార్ట్ ఫిలింలకు ప్రోత్సాహమనీ.. 20 నిమిషాల షార్ట్  ఫిలింలో 8 సంవత్సరాల బాలుడి గుంచి..తల్లి వారి పొలంలో పనిలో బిజీగా ఉన్నప్పుడు తన సోదరిని చూసుకోవటం మనస్సుల్ని హత్తుకునే సన్నివేశాలని అన్నారు. కేవలం రెండు డైలాగులు మాత్రమే ఉన్న ఈ చిత్రం కేవలం సన్నివేశాల ద్వారానే ప్రేక్షకులకు బావం అర్థమయ్యేలా ఉంటుందని అన్నారు. 

 శ్రవణ్ తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తెలుగులో వేదం, గమ్యం, ఆనందోబ్రహ్మ చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. కాగా కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్..ప్రముఖ మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ప్రారంభించారు.