ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం: ఆర్టీసీ సిబ్బంది ఔదార్యం

  • Published By: chvmurthy ,Published On : January 14, 2019 / 12:46 PM IST
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం: ఆర్టీసీ సిబ్బంది ఔదార్యం

హైదరాబాద్: ప్రభుత్వ వైద్యుల నిర్వాకంవల్ల ఒక మహిళ బస్టాండ్ లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ కు చెందిన చెంచు మణెమ్మ(33) అనే మహిళ నిండు గర్భిణి. ప్రసవం కోసం తన తల్లి సాయంతో ఆదివారం హైదరాబాద్ లోని ఓ ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. ఆమె ప్రెగ్నెన్సీ చెకప్ కు సంబంధించి సరైన రికార్డులు లేవనే కారణంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చుకోటానికి వైద్యులు నిరాకరించారు. చేసేదేమి లేక ఇంటికి తిరిగి వెళ్లేందుకు తల్లి, కూతురు కలిసి తిరిగి ఆదివారం సాయంత్రం ఎంజీబీఎస్ కు వచ్చారు.
బస్టాండ్ లో బస్సు కోసం వేచివుండగా మణెమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది చుట్టూ చీరలు కట్టి  ప్రసవానికి ఏర్పాట్లు చేశారు. ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న ఆర్టీసి సిబ్బంది కొంత ధన సహాయం చేసి ఆమెను 108 అంబులెన్స్ లో పేట్ల బురుజు దవాఖానాకు తరలించారు.