న్యూ ఇయర్‌పై నిఘా : డ్రగ్స్ తీసుకున్నా..అమ్మినా 10 ఏళ్లు జైలు ఖాయం

2020 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డ్రగ్స్ అమ్మినా..తీసుకున్నా 10 సంవత్సరాల జైలు తప్పదని రాచకొండ కమిషనర్ మహేశ్ భగత్ హెచ్చరించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నగరంలో డ్రగ్స్ మాఫియా పంట పండిస్తాయి. యువతే టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా ఆడగాలు సాగుతున్నాయి. సాధారణ రోజులు కంటే న్యూ ఇయర్ లో మరింతగా డ్రగ్స్ మాఫికా కన్ను విస్తరిస్తుంది. న్యూ ఇయర్ వచ్చిదంటే చాలు సాధారణ సయమంలో అమ్మే రేట్ల కంటే పదిరెట్లు పెంచేస్తారు. గ్రాము కొకైన్ రూ. వెయ్యి ఉంటే న్యూ ఇయర్ కు రూ.10 పెంచేస్తారు. ఆల్రెడీ పెంచేసినట్లుగా తెలుస్తోంది. దీంతో న్యూఇయర్ సందర్భంగా డ్రగ్స్ మాఫియాపై పోలీసులు మరింత నిఘా పెట్టారు.
హైదరాబాద్ ను టార్గెట్ చేసిన డ్రగ్స్ మాఫియా మత్తుబాబుల చిట్టాను రెడీ చేసుకుంది. రెగ్యులర్ కష్టమర్లే కాకుండా కొత్తవారిని దీంట్లోకి లాగేందుకు ప్లాన్స్ వేసింది. కొకైన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ లాంటి నిషేధిత మత్తు పదార్థాలు మా దగ్గర ఉన్నాయని ఇంటిమేషన్ ఇస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. వీటిని కల్తీ చేసిన మరీ అమ్మేందుకు డ్రగ్ మాఫియా రెడీ అయిపోయింది. 150 గ్రాముల హెరాయిన్ కు పలు రసాయనాలు కలిపి వాటిని విక్రయిస్తున్నారు.
ఈ క్రమంలో రాచకొండ, సైబరాబాద్ పోలీసులు డ్రగ్స్ దందా చేసే వారిపై స్పెషల్ నజర్ పెట్టారు. దీంట్లో భాగంగా రాచకొండ పోలీసులు గురువారం (డిసెంబర్ 26)కుషాయిగూడలో కిషన్, అనిల్, రాజేశ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 150 గ్రాముల హెరాయిన్, 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. న్యూఇయర్‌ను టార్గెట్ చేసుకుని ముంబై, రాజస్థాన్ నుంచి తీసుకువచ్చి.. హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్మటానికి వచ్చారని విచారణలో తేలింది. న్యూ ఇయర్‌లో మత్తు పదార్థాలకు మంచి డిమాండ్ ఉందనీ భారీగా కాసులు కురిపిస్తుందని భావించిన డ్రగ్స్ మాఫియా భావించినట్లుగా రాచకొండ ఎస్‌ఓటీ, కుషాయిగూడ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో తేలింది. ఈ క్రమంలో రాచకొడ కమిషనర్ మాట్లాడుతూ..న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రగ్స్ అమ్మినా..తీసుకున్నా 10 సంవత్సరాల జలు తప్పదని హెచ్చరించారు.
నగర పౌరులు కూడా డ్రగ్స్ ముఠాల గురించి సమాచారం అందించాలని సూచించారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని కోరారు. కొత్త సంవత్సరం వేడుకల్లో యువత డ్రగ్స్ బారిన పడి ఆరోగ్యాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ అమ్మినావారినే కాకుండా డ్రగ్స్ తీసుకున్న వారిని కూడా నేరస్థులుగా పరిగణిస్తామని..విచారణలో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు రుజువైతే 10 ఏళ్లు ఖాయమని హెచ్చరించారు.