likely to be rains : తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే చాన్స్

రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలుకురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.

likely to be rains : తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే చాన్స్

Rains In Telangana

next 24 hours likely to be rains few districts in Telangana : గతవారం రోజులుగా భానుడి ప్రతాపానికి అల్లాడుతున్న ప్రజలుకు వతావరణ శాఖ చల్లటి కబులు అందించింది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలుకురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.

తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడు వరకు 0.9 కి.మీ. వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈరోజు బలహీనపడిందని .. దీవి కారణంగా రాష్ట్రంలోని కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.