జూపార్క్‌కు జిరాఫీలు తరలింపులో ఆలస్యం

  • Published By: vamsi ,Published On : March 7, 2019 / 06:44 AM IST
జూపార్క్‌కు జిరాఫీలు తరలింపులో ఆలస్యం

వేసవిలో వచ్చే వీక్షకులను అలరించేందుకు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కుకు జిరాఫీను కోల్‌కతా నుంచి తీసుకుని వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జిరాఫీ జంటను పెద్ద కంటైనర్ ద్వారా 1500 కిమీలు ప్రయాణం చేయించి తీసుకుని వస్తున్నారు. మగ, ఆడ జిరాఫీలకు ఇబ్బంది కలగకుండా హైదరాబాద్‌కు తీసుకు వచ్చేందుకు ముందుగానే ఏర్పాట్లు చేసిన సిబ్బంది, మధ్యలో అనేక సమస్యలను ఎదుర్కొంది.

రోడ్డు మార్గంలో గంటకు 30కీమీ వేగంతోనే జిరాఫీలను తీసుకుని రావలిసి ఉండగా వాటికి ఎటువంటి గాయాలు తగలకుండా 14అడుగుల క్రేట్‌లో జాగ్రత్తగా తీసుకుని వస్తున్నారు. మధ్యలో విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ స్టేడియం వద్ద ఆపి వాటి పరిస్థితి ఏంటి అనేది చూశారు. వాటి సంరక్షకులతో పాటు పోలీసు సిబ్బంది జంతువులు ప్రయాణించే వాహనంతో ఉన్నారు.
ఇదే క్రమంలో NH16 రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దాటినప్పటి నుండి సాధారణ వేగం 30Kmph కంటే సగానికిపైగా వేగం తగ్గించి తీసుకుని వచ్చారు. దీంతో నాలుగు గంటలు అలస్యంగా ప్రయాణం జరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్‌కు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. విశాఖపట్నం నుండి బయల్దేరిన జిరాఫీ జంట మార్చి 8వ తేదీకి హైదరాబాద్ జూపార్క్‌కు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

13అడుగులు ఎత్తైన మగ జిరాఫీ, 12అడుగుల ఎత్తైన ఆడ జిరాఫీలను అసలు మార్చి 1నే తీసుకుని రావలిసి ఉండగాజజ కోల్‌కతా వర్షం పడుతుండటంతో ప్రయాణంను వాయిదా వేసుకున్నారు. ఈ జిరాఫీలు మార్చి 8వ తేదీ తర్వాత వీక్షకులకు అందుబాటులో ఉంటాయి.