దిశ తల్లిని ఇబ్బంది పెట్టొద్దు : ఎన్ కౌంటర్ పై NHRC దర్యాఫ్తు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్ సీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు హాజరుకావాలని ఎన్ హెచ్ ఆర్ సీ దిశ తల్లిదండ్రులకు పిలుపు ఇచ్చింది.

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 10:46 AM IST
దిశ తల్లిని ఇబ్బంది పెట్టొద్దు : ఎన్ కౌంటర్ పై NHRC దర్యాఫ్తు

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్ సీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు హాజరుకావాలని ఎన్ హెచ్ ఆర్ సీ దిశ తల్లిదండ్రులకు పిలుపు ఇచ్చింది.

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్ సీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు హాజరుకావాలని ఎన్ హెచ్ ఆర్ సీ దిశ తల్లిదండ్రులకు పిలుపు ఇచ్చింది. దిశ తల్లిదండ్రుల స్టేట్ మెంట్ రికార్డ్ చేయనుంది. అలాగే నిందితుల కుటుంబ సభ్యులను దర్యాప్తు చేస్తున్న ఎన్ హెచ్ ఆర్ సీ బృందం.. వారి స్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేయనుంది. తెలంగాణ పోలీస్ అకాడమీలో విచారణ రహస్యంగా సాగుతోంది. పోలీసులు నిందితుల కుటుంబ సభ్యులను పోలీస్ అకాడమీకి గోప్యంగా తీసుకొచ్చారు. 

శంషాబాద్ లోని దిశ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. దిశ తల్లిదండ్రులను కూడా పోలీస్ అకాడమీకి తీసుకెళ్లనున్నారు. నిజాలు చెప్పేందుకు ఎన్ హెచ్ ఆర్ సీ దగ్గరకు వెళ్తామని వారు చెబుతున్నారు. అయితే దిశ తల్లి ఆరోగ్యం బాగాలేదని, ఇబ్బంది పెట్టొద్దని కుటుంబ సభ్యులు ఎన్ హెచ్ ఆర్ సీకి విజ్ఞప్తి చేశారు. దిశ దశ దినకర్మ రోజున విచారణ పేరుతో కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్ కౌంటర్ లో గాయపడి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు పోలీసు ఆఫీర్ల నుంచి ఎన్ హెచ్ ఆర్ సీ ఇవాళ ఉదయం 9.30 గంటలకు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. నందిగామ ఎస్ ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్ గౌడ్ ల నుంచి ఎన్ కౌంటర్ జరిగిన తీరుపై భారీ స్టేట్ మెంట్ ను రికార్డు చేసుకున్నారు. 

మరోవైపు తెలంగాణ పోలీస్ అకాడమీలో నిందితుల కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఎన్ కౌంటర్ జరిగిన తీరుకు సంబంధించి నిందితుల కుటుంబ సభ్యుల అభ్యంతరాలను తీసుకుంటున్నారు. దిశ కుటుంబ సభ్యులను కూడా విచారణకు పిలిపించారు. మరికొద్ది సేపట్లో వారు పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలు, నిందితుల కుటుంబ సభ్యులు వివరాలను స్టేట్ మెంట్ రికార్డు చేసుకోనున్నారు. వీటిపై సమగ్ర నివేదిక తయారు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. 

రేపు తెలంగాణ హైకోర్టులో దిశ కేసుకు సంబంధించి కొన్న మహిళా సంఘాలు, ఆలిండియా ఉమెన్ ప్రొగ్రెసివ్ సంస్థ సభ్యులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే నలుగురు నిందితుల మృతదేహాలు మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో భద్రపరిచారు. ఈనెల 9వ తేదీ వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మృతదేహాలను మెడికల్ కాలేజీలో భద్రపరిచారు. రేపు హైకోర్టు విచారణ జరిగాకా నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా లేదా అన్న అంశంపై స్పష్టమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హైకోర్టు దిశ కేసు విచారణ చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. 

మరోవైపు ఎన్ హెచ్ ఆర్ సీ రెండు రోజు దర్యాప్తు కొనసాగిస్తోంది. ఎన్ కౌంటర్ జరిగిన తీరును పరిశీలించేందుకు శనివారం ఎన్ హెచ్ ఆర్ సీ బృందం చటాన్ పల్లికి వెళ్లింది. అక్కడ దిశ హత్య జరిగిన స్థలాన్ని, నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన స్థలాన్ని పరిశీలించారు. వాటికి సంబంధించి వివరాలను పోలీసుల నుంచి సేకరించారు. మొత్తంగా ఎన్ కౌంటర్ కు సంబంధించి ఎన్ హెచ్ ఆర్ సీ సుమోటోగా స్వీకరించింది.