సంక్రాంతి ఖుషీ: 3 రోజులు టోల్ గేట్ ఛార్జీలు రద్దు

  • Edited By: chvmurthy , January 12, 2019 / 01:13 PM IST
సంక్రాంతి ఖుషీ: 3 రోజులు టోల్ గేట్ ఛార్జీలు రద్దు

సంక్రాంతి పండుగ జర్నీ చేసే వారికి స్వీట్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. మూడు రోజులు టోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం, గంటలకొద్దీ సమయం పడుతుంటంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ తోపాటు చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల నుంచి కూడా కోట్ల మంది తెలుగోళ్లు ఏపీలోని సొంతూళ్లకు ప్రయాణం అయ్యారు. లక్షల కార్లు, బస్సుల్లో తరలివస్తున్నారు. లక్షల సంఖ్యలో వాహనాలు ఏపీకి వస్తుండటంతో టోల్ గేట్ల దగ్గర అవస్థలు పడుతున్నారు. ఒక్కో వాహనానికి కనీసం 2 నిమిషాల సమయం పడుతుంది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా రద్దీ తగ్గటం లేదు. గంటలకొద్దీ సమయం వృధా అవుతుంది. 
పండగ ప్రయాణం భారంగా మారింది. ఇప్పటికే ఆర్టీసీ అదనపు ఛార్జీలతో బాదేస్తోంది. ప్రైవేట్ బస్సులు 5, 6 రెట్లు చార్జీలు పెంచేశారు. ప్రయాణ టికెట్ల భారమే తలకు మించిందిగా భావిస్తోంది. టోల్ గేట్ల దగ్గర ఛార్జీలతోపాటు సమయం కూడా తినేస్తోంది. ప్రయాణికుల బాధలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 12, 13తేదీలతోపాటు 16వ తేదీన టోల్ గేట్ ఛార్జీలను రద్దు చేసింది. అంటే వాహనాలు ఫ్రీగా వెళ్లిపోవచ్చు. ఆగాల్సిన అవసరం లేదు. ఏపీ ప్రభుత్వం ప్రయాణికులకు ఇచ్చిన సంక్రాంతి చిరు కానుక ఇది. రైడర్స్.. బీ అలర్ట్.. ఏపీలో టోల్ గేట్ల దగ్గర ఛార్జీలు లేవు. మీ మిత్రులు, బంధువులకు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. వారి డబ్బు ఆదా చేయండి..