కంప్లయింట్ చేసిన ఎస్ఐ..రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు

  • Published By: madhu ,Published On : October 23, 2019 / 06:43 AM IST
కంప్లయింట్ చేసిన ఎస్ఐ..రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధి నిర్వాహణలో ఉన్న అధికారితో దురుసుగా ప్రవర్తించినందుకు, ఎస్.ఐ నవీన్ రెడ్డి కంప్లయింట్ మేరకు రేవంత్ రెడ్డిపై ఐపీసీ సెక్షన్ 341, 332, 353 కింద నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చింది. జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 48లో ఉన్న రేవంత్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన్ను హౌజ్ అరెస్టు చేశారు. ఆయన బయటకు రాకుండా కట్టడి చేశారు. 

కానీ..మధ్యాహ్నం 12 గంటల సమయంలో రేవంత్, తన అనుచరులతో కలిసి బయటకు వేగంగా దూసుకొచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న బైక్‌‌పై ప్రగతి భవన్‌ వైపు వచ్చారు. ఈ సమయంలో ఎస్ఐ నవీన్ రెడ్డి, పలువురు పోలీసులు రేవంత్‌ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. వారిని పక్కకు తోసేస్తూ..వెళ్లారు రేవంత్. ఈ నేపథ్యంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన రేవంత్ రెడ్డిపై ఎస్ఐ నవీన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Read More : సీడబ్ల్యూసీ హెచ్చరికలు. : శ్రీశైలం, సాగర్ గేట్ల ఎత్తివేత