ఘన నివాళి : తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ 

  • Published By: veegamteam ,Published On : January 18, 2019 / 04:59 AM IST
ఘన నివాళి : తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ 

హైదరాబాద్‌ : ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, నారా బ్రాహ్మణి, సుహాసిని, సినీ దర్శకుడు క్రిష్‌ తదితరులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిలో నిలిచి ఉంటారని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు..గెలిపించేందకు ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారనీ..ఆయన అడుగు జాడల్లోనే మేముకూడా నడుస్తామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎంత మంది నాయకులు వచ్చినా, ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అవన్నీ ఎన్టీఆర్ స్పూర్తితో వచ్చినమేనని బాలయ్య వ్యాఖ్యానించారు. లంచగొండితనం ఇష్టం లేక ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేశారనీ..సినిమాల్లో ఎదురులేకుండా సాగిన ఆయన రాజకీయాల్లోనూ అంతే స్థాయిలో వెలుగొందారని,పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన గొప్ప వ్యక్తి అని ఆయనకు ఆయనే సాటి అని బాలకృష్ణ అన్నారు. 

తెలుగువారి గుండెల్లో ఆరాధ్యుడు : లక్ష్మీపార్వతి
ఎన్టీఆర్ ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో ఆరాధ్యుడని ఆయన సతీమణి, వైసీపీ నేత లక్ష్మీ పార్వతి తెలిపారు, సినీనటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 23వ వర్థంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించింది. ఎన్టీఆర్ ఆత్మ శాంతించలేదని..ఘోషిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. తన గుండెల్లో మంట చల్లారలేదని..కళ్లలో నీరు ఆగలేదనీ..ని  ఎన్టీఆర్ మహిళలను ఎంతగానో గౌరవించేవారని ఆమె గుర్తు చేస్తున్నారు.

గొప్ప నటుడు, ప్రజానాయకుడు ఎన్టీఆర్ 
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ బిరుదాంకితుడైన గొప్ప నటుడు, ప్రజానాయకుడు. , తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు. తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు. రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఎన్టీఆర్. టీడీపీ పార్టీ స్థాపనతో ప్రాంతీయ పార్టీలకు కొత్త ఒరవడి తీసుకొచ్చిన గొప్ప నేత ఎన్టీఆర్. ఇలా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.