Charminar: నేడు చార్మినార్ 444 పుట్టిన‌రోజు.. విశేషాలివే..

హైద‌రాబాద్ అంటే మొద‌ట‌గా గుర్తుకువ‌చ్చేది చార్మినార్‌. న‌గ‌రానికి అంతర్జాతీయ యవనికపై చార్మినార్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింద‌నే చెప్పుకోవాలి. దేశ, విదేశీ ప‌ర్యాట‌కుల‌ను చార్మినార్ ఆక‌ర్షిస్తుంది. నేడు చార్మినార్ 444వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటోంద‌ని చెప్పుకోవ‌చ్చు. అంటే, స‌రిగ్గా 444 ఏళ్ళ క్రితం చార్మినార్‌ను ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ప్రారంభించారు. చార్మినార్‌ను ముహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇస్లాం సంప్రదాయాలను అనుసరించే వారు హిజ్రీ క్యాలెండర్‌ను వాడుతుంటారు.

Charminar: నేడు చార్మినార్ 444 పుట్టిన‌రోజు.. విశేషాలివే..

Charminar

Charminar: హైద‌రాబాద్ అంటే మొద‌ట‌గా గుర్తుకువ‌చ్చేది చార్మినార్‌. న‌గ‌రానికి అంతర్జాతీయ యవనికపై చార్మినార్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింద‌నే చెప్పుకోవాలి. దేశ, విదేశీ ప‌ర్యాట‌కుల‌ను చార్మినార్ ఆక‌ర్షిస్తుంది. నేడు చార్మినార్ 444వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటోంద‌ని చెప్పుకోవ‌చ్చు. అంటే, స‌రిగ్గా 444 ఏళ్ళ క్రితం చార్మినార్‌ను ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం ప్రారంభించారు. చార్మినార్‌ను ముహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించార‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇస్లాం సంప్రదాయాలను అనుసరించే వారు హిజ్రీ క్యాలెండర్‌ను వాడుతుంటారు.

ఆ క్యాలెండ‌ర్‌లోని 1.1.1000 తేదీన చార్మినార్‌ను ప్రారంభించారు. అంటే, హిజ్రీ క్యాలెండర్‌లోని 1,000వ సంవ‌త్స‌రంలోని తొలి మొహర్రం రోజు నుంచి ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం దీని ప్రారంభోత్స‌వం చేశారు. ఆ క్యాలెండ‌ర్ ప్ర‌కార‌మే ఇవాళ చార్మినార్ 444 సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టింది. చార్మినార్ నిర్మాణానికి శంకుస్థాప‌న ఎప్పుడు చేశార‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త‌లేదు. అలాగే, హిజ్రీ క్యాలెండర్ ప్ర‌కారం జూలై 31న చార్మినార్‌ను ప్రారంభించార‌న్న వాద‌న‌తో పాటు జార్జియ‌న్ క్యాలెండ‌ర్ ప్ర‌కారం 1591, అక్టోబ‌రు 9న చార్మినార్‌ను ప్రారంభించార‌న్న వాద‌న కూడా ఉంది.

హైదరాబాద్‌లో భ‌యంక‌ర‌మైన ప్లేగు మ‌హ‌మ్మారిని నిర్మూలించిన సంద‌ర్భంగా కులీ కుతుబ్ షా చార్మినార్‌ను క‌ట్టించాడు. చార్మినార్ అంటే నాలుగు మినార్లు (ట‌వ‌ర్లు) ఉన్న‌ది అని అర్థం. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో చార్మినార్ నుంచి గోల్కొండ‌కు వెళ్ళ‌డానికి చార్మినార్ కింద ర‌హ‌స్య సొరంగం కూడా ఉంద‌ని కొంద‌రు అంటుంటారు. చార్మినార్‌ను న‌గ‌రం న‌డిబొడ్డున నిర్మించారు. 1889లో లండ‌న్ నుంచి తీసుకొచ్చిన పెద్ద గ‌డియారాల‌ను చార్మినార్‌కు నాలుగు వైపులా ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్‌లో నిర్మించిన మొట్ట‌మొద‌టి బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నం చార్మినార్‌. చార్మినార్ వ‌ద్దే మ‌క్కా మ‌సీద్, భాగ్య‌ల‌క్ష్మీ మందిరం ఉంటాయి. మత సామరస్యానికి చిహ్నం ఈ ప్రాంతం నిలుస్తోంది.

China: అంద‌రినీ భ‌య‌పెట్టిన త‌మ‌ రాకెట్ శ‌కలాలు ఎక్క‌డ ప‌డ్డాయో తెలిపిన చైనా