హైదరాబాద్‌లో One Plus R&D సెంటర్ ప్రారంభం

  • Edited By: sreehari , August 26, 2019 / 07:45 AM IST
హైదరాబాద్‌లో One Plus R&D సెంటర్ ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు తమ వ్యాపారాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. దేశ మొబైల్ మార్కెట్లో తమ ప్రొడక్టులను విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో టెక్ కంపెనీలు హైదరాబాద్ వేదికగా సేవలు అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ సేల్ మార్కెట్ కు ఇండియా కీలకంగా మారింది. స్మార్ట్ ఫోన్ మేకర్లు షియోమీ, వన్ ప్లస్, మోటరోలా కంపెనీలు ఇండియాలో తమ ప్రొడక్టులను పోటీపడి రిలీజ్ చేస్తు వస్తున్నాయి. ఈ కామర్స్ ప్లాట్ ఫాం  ద్వారా భారత్ లో తమ ఆన్ లైన్ మార్కెట్ ను విస్తరించుకున్నాయి. చివరికి ఇండియాలో ఆఫ్ లైన్ మార్కెట్ రూట్ ను కూడా సక్సస్ ఫుల్ గా విస్తరించాయి. 

2018లో కంపెనీకి భారీ రెవెన్యూ రావడంతో.. వన్ ప్లస్ కంపెనీ.. ప్రత్యేకించి ఇండియానే తమ మార్కెట్ విస్తరణలో ఒక భాగంగా ఎంచుకుంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ వన్ ప్లస్ గ్లోబల్ ఆర్ అండ్ డి సెంటర్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దేశంలోనే వన్ ప్లస్ తొలి రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్‌ కేంద్రంగా సేవలు అందించనుంది. వన్ ప్లస్ ఆర్ అండ్ డి సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. 2018 ఏడాదిలోనే హైదరాబాద్ కేంద్రంగా వన్ ప్లస్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

2019 ఏడాదిలో మేము.. మూడు కొత్త ఎక్స్ పీరియన్స్ స్టోర్లను ఓపెన్ చేయబోతున్నామని ప్రకటించింది. పుణెలో ఒక ఎక్స్ పీరియన్స్ స్టోర్ ఓపెన్ చేస్తాం. హైదరాబాద్ లో ఓపెన్ చేయబోయే వన్ ప్లస్ స్టోర్ (16వేల చదరపు అడుగులు) ప్రపంచంలోనే అతిపెద్దది’ అని వన్ ప్లస్ సహా వ్యవస్థాపకుడు Carl Pei తెలిపారు. వన్ ప్లస్ కంపెనీకి సంబంధించి ఎక్స్ పీరియన్స్ సెంటర్లు ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, చెన్నైలో ఉన్నాయి కూడా.