హమ్మయ్య : దిగి వస్తున్న ఉల్లి ధరలు

హమ్మయ్య.. కోయకుండానే కంటతడి పెట్టించిన ఉల్లి ధరలు, ఆకాశాన్ని తాకిన ఉల్లి ధరలు.. డబుల్ సెంచరీ కొట్టిన ఉల్లి ధరలు.. నెమ్మదిగా దిగి వస్తున్నాయి. కొత్త పంట

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 02:39 AM IST
హమ్మయ్య : దిగి వస్తున్న ఉల్లి ధరలు

హమ్మయ్య.. కోయకుండానే కంటతడి పెట్టించిన ఉల్లి ధరలు, ఆకాశాన్ని తాకిన ఉల్లి ధరలు.. డబుల్ సెంచరీ కొట్టిన ఉల్లి ధరలు.. నెమ్మదిగా దిగి వస్తున్నాయి. కొత్త పంట

హమ్మయ్య.. కోయకుండానే కంటతడి పెట్టించిన ఉల్లి ధరలు, ఆకాశాన్ని తాకిన ఉల్లి ధరలు.. డబుల్ సెంచరీ కొట్టిన ఉల్లి ధరలు.. నెమ్మదిగా దిగి వస్తున్నాయి. కొత్త పంట అందుబాటులోకి వస్తోంది. దీంతో ధరలు తగ్గుతున్నాయి. మహారాష్ట్ర నుంచి కొత్త ఉల్లి పంట హైదరాబాద్ లోని మలక్ పేట్ మార్కెట్ కు వచ్చింది. మేలు రకం కిలో ఉల్లి ధర రూ.70 నుంచి రూ.90గా ఉంది. మరోవైపు రైతు బజార్లలో ప్రభుత్వం కిలో ఉల్లిని రూ.40కే విక్రయిస్తోంది. ఒక్క మహారాష్ట్ర నుంచే కాదు.. కర్నాటక, మహబూబ్ నగర్, మెదక్ నుంచి కొత్త ఉల్లి పంట హైదరాబాద్ మార్కెట్ కి వచ్చింది. దీంతో ఉల్లి ధరలు క్రమేపి తగ్గుతాయని చెబుతున్నారు.

దాదాపు 2 నెలలుగా ఉల్లి ధరలు చుక్కలను తాకాయి. కిలో ఉల్లి ధర రూ.200వరకు వెళ్లింది. సాధారణంగా కిలో 30 లేదా 40 ఉండేది. అలాంటిది.. ఒక్కసారిగా ఉల్లిపాయల ధరలు పెరిగిపోయాయి. ఉల్లి కొనే పరిస్థితి లేకుండా పోయింది. అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అసలు ఉల్లి తినడమే మానేశారు. రెస్టారెంట్లు, హోటల్స్ లో ఉల్లి లేకుండానే ఫుడ్ ఐటెమ్స్ ఇచ్చే పరిస్థితి ఉంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సబ్సిడీ కింద ఉల్లిని విక్రయించి ప్రజలకు కొంత ఊరట ఇచ్చాయి. ఏపీలో రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.25కే ప్రభుత్వం విక్రయిస్తోంది. తెలంగాణలో రూ.40కి విక్రయిస్తున్నారు.

ఇప్పుడు కొత్త పంట అందుబాటులోకి రావడంతో.. ఉల్లి ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధరలు తగ్గుతున్నాయనే వార్త కొనుగోలుదారులకు కొంత రిలీఫ్ ఇచ్చింది.