ఇక నుంచి ఆ నాలుగు ఆలయాల్లోనూ ఆన్‌లైన్‌ సేవలు

తెలంగాణలో మరో నాలుగు ప్రధాన దేవాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆన్ లైన్ సేవలు ప్రారంభించారు.

ఇక నుంచి ఆ నాలుగు ఆలయాల్లోనూ ఆన్‌లైన్‌ సేవలు

తెలంగాణలో మరో నాలుగు ప్రధాన దేవాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఆన్ లైన్ సేవలు ప్రారంభించారు.

తెలంగాణలో మరో నాలుగు ప్రధాన దేవాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి గుడి, వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయం, కొండగట్టు అంజన్న స్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో ఆన్‌లైన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. బుధవారం (సెప్టెంబర్ 4, 2019) హైదరాబాద్‌ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో మంత్రి ఆన్ లైన్ సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రభాతం, అభిషేకం, అర్చన, హోమాలు, ఏకాంత సేవ, పవళింపు సేవ, వసతి గదులు, శాశ్వత పూజలు, అన్నదానం తదితర సేవలను ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చని మంత్రి ఇంద్రకరణ్‌ తెలిపారు.  

భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలో మొత్తం 11 ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మొబైల్ యాప్, మీ సేవా ద్వారా ఈ ఆన్‌లైన్ సేవలు పొందవచ్చన్నారు. భక్తులకు కొరియర్‌ ద్వారా ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వేములవాడలో ఆలయ ప్రసాద కొరియర్ సేవలను గురువారం (సెప్టెంబర్ 5, 2019) ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

దేవాలయాల పునరుజ్జీవనం, నూతన ఆలయాల నిర్మాణం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారాయన. ఆలయ అధికారులు, అర్చకుల సంక్షేమం కోసం సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. మిడ్ మానేరు ద్వారా వేములవాడ ఆలయ చెరువులోకి కాళేశ్వరం నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

Also Read : బామ్మ కాదు అమ్మ : కవలలకు జన్మనివ్వనున్న 73 ఏళ్ల వృద్ధురాలు