OU ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసుల సోదాలు ఆపేయాలి : విద్యార్ధుల ఆందోళన అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 05:35 AM IST
OU ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసుల సోదాలు ఆపేయాలి : విద్యార్ధుల ఆందోళన అరెస్ట్

ఓయూ ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసుల సోదాలను ఖండించిన ఓయూ విద్యార్ధులు తీవ్రంగా ఖండించారు. పోలీసులు సోదాలను నిరసిస్తూ కాశీం నివాసం వద్ద విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు విద్యార్దులను చెదరగొట్టారు. పోలీసులపై వాగ్వాదానికి దిగిన కొంతమంది విద్యార్దులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో కాశీం ఇంట్లో పోలీసుల సోదాలు నిలిపివేయాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన ఎమర్జెన్సీని తలపించేలా ఉందని విమర్శించారు.  

ఓయూ క్యాంపస్ లోని క్వార్టర్స్ లో నివాసిస్తున్న ప్రొఫెసర్ కాశీంకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో కాశీం నివాసంలో గజ్వేల్ పోలీసులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. 2016లో కాశీంపై నమోదైన ఓ కేసు విచారణలో భాగంగా..కాశీంకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్న క్రమంలో పోలీసులు కాశీం ఇంట్లో సోదాలు చేశారు. కాగా..కాశీం ఇటీవలే విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దీంతో మరింత అనుమానాలు పెరగటంతో పోలీసులు సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలోని పోలీసులు బృందం శనివారం (జనవరి 18,2020) ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. 

2016లో సిద్ధిపేట సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలోని ఓ కారులో కాశీంకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లుగా కొన్ని కీలక డాక్యుమెంట్లు, కరపత్రాలు పోలీసుల కళ్లబడ్డాయి. వీటి ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగించారు. దీంట్లో భాగంగా కాశీంకు ఈ  మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లుగా తెలిసింది. కారులో లభ్యమైన కీలక డాక్యుమెంట్లు, కరపత్రాలను కాశీం పంపిణీచేసినట్లుగా పోలీసులు గుర్తించారు.  ఈ క్రమంలో ప్రొఫెసర్ కాశీం ఇటీవల విరసం కార్యదర్శిగా ఎన్నికైన క్రమంలో మరోసారి పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.