30 రోజుల్లో 1700 మంది దొరికిపోయారు : భారీగా పెరిగిన డ్రంకెన్ డ్రైవ్ కేసులు

హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా, కఠిన శిక్షలు వేస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. మళ్లీ తాగి

  • Published By: veegamteam ,Published On : November 3, 2019 / 05:45 AM IST
30 రోజుల్లో 1700 మంది దొరికిపోయారు : భారీగా పెరిగిన డ్రంకెన్ డ్రైవ్ కేసులు

హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా, కఠిన శిక్షలు వేస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. మళ్లీ తాగి

హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్ని రూల్స్ తీసుకొచ్చినా, కఠిన శిక్షలు వేస్తున్నా మందుబాబుల్లో మార్పు రావడం లేదు. మళ్లీ తాగి రోడ్డెక్కుతున్నారు. డ్రైవింగ్ చేసి అడ్డంగా దొరికిపోతున్నారు. హైదరాబాద్ లో అక్టోబర్ నెలలో ఏకంగా 1700 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 

అక్టోబర్ నెలలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు గురించి ట్రాఫిక్ పోలీసులు షాకింగ్ వివరాలు వెల్లడించారు. ఈ నెలలో నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 1700మంది పట్టుబడ్డారని చెప్పారు. తాగి డ్రైవింగ్ చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో దొరికిన మందుబాబులను పోలీసులు మూడు, నాలుగవ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో హాజరుపరిచారు. 282 మందికి కోర్టులు జైలు శిక్ష విధించాయి. ఐదుగురి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసింది. 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేశారు. ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ని శాశ్వతంగా క్యాన్సిల్ చేశారు. జరిమానాలు కూడా పెద్ద సంఖ్యలో విధించాయి కోర్టులు. ఫైన్ల రూపంలో కోటి 71లక్షల 51వేల 200 రూపాయలు వసూలు చేయడం విశేషం.

జైలు శిక్ష పడిన మందుబాబులను పోలీసులు చంచల్ గూడ జైలుకి తరలించారు. ఆ తర్వాత గోషామహల్, బేగంపేటలోని ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ కి తీసుకెళ్లి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారు. డ్రంకెన్ డ్రైవింగ్ కారణంగా జరిగే అనర్థాలను వారికి వివరించారు. స్వయంగా ప్రమాదంలో పడటమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని చెప్పారు. చాలావరకు రోడ్డు ప్రమాదాల్లో తాగి వాహనాలు నడపటం వల్లే జరుగుతున్నాయి. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ప్రాణాలు తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు రూల్స్ ని కఠినం చేసి డ్రంకెన్ డ్రైవ్ లను పెంచినా.. మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు.