మాకు అన్యాయం జరిగినప్పుడు NHRC ఎక్కడుంది : దిశ తండ్రి

దిశ కుటుంబం తెలంగాణ పోలీసు అకాడమీకి చేరుకుంది. ఎన్ హెచ్ ఆర్ సీ పిలుపు మేరకు దిశ కుటుంబ సభ్యులను పోలీసులు పోలీస్ అకాడమీకి తరలించారు.

  • Published By: veegamteam ,Published On : December 8, 2019 / 11:55 AM IST
మాకు అన్యాయం జరిగినప్పుడు NHRC ఎక్కడుంది : దిశ తండ్రి

దిశ కుటుంబం తెలంగాణ పోలీసు అకాడమీకి చేరుకుంది. ఎన్ హెచ్ ఆర్ సీ పిలుపు మేరకు దిశ కుటుంబ సభ్యులను పోలీసులు పోలీస్ అకాడమీకి తరలించారు.

దిశ కుటుంబం తెలంగాణ పోలీసు అకాడమీకి చేరుకుంది. ఎన్ హెచ్ ఆర్ సీ పిలుపు మేరకు దిశ కుటుంబ సభ్యులను పోలీసులు పోలీస్ అకాడమీకి తరలించారు. విచారణ కోసం వారిని పోలీస్ అకాడమీకి తరలించారు. ఎన్ కౌంటర్ పై దిశ కుటుంబ సభ్యులతో ఎన్ హెచ్ ఆర్ సీ మాట్లాడనుంది. అటు ఎన్ హెచ్ ఆర్ సీ తీరుపై దిశ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం జరిగినప్పుడు రాని మానవ హక్కుల కమిషన్ ఇప్పుడు వచ్చిందంటూ మండిపడ్డారు. తమకు అన్యాయం జరిగినప్పుడు ఎవరూ రాలేదని దిశ తండ్రి అన్నారు. ఎన్ హెచ్ ఆర్ సీనే తమ దగ్గరకు రమ్మని చెప్పామని… భద్రతా కారణాల రీత్యా మమ్మల్నే పోలీస్ అకాడమీకి రమ్మన్నారని తెలిపారు. దిశ కేసులో జరిగిందంతా ఎన్ హెచ్ ఆర్ సీకి వివరిస్తామని చెప్పారు.

అంతకముందు నిందితుల కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించింది దర్యాప్తు బృందం. వారి స్టేట్ మెంట్ ను రికార్డు చేసింది. మృతుల వ్యక్తిత్వం, అలవాట్లతోపాటు ఎన్ కౌంటర్ పై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. నిన్న ఎన్ కౌంటర్ ప్రదేశంలో ఎన్ హెచ్ ఆర్ సీ బృందం అణువణువు పరిశీలించింది. నిందితులు దిశను దహనం చేసిన ప్రాంతాన్ని, దిశ స్కూటీని పార్క్ చేసిన స్థలాన్ని కూడా పరిశీలించారు. కొన్ని వీడియోలు తీశారు. ఘటనకు సంబంధించి పోలీసుల దగ్గరి నుంచి వివరాలు తీసుకున్నారు. 

ఎన్ కౌంటర్ సమయంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు? దిశను కాల్చేసిన ప్రాంతానికి, ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఎంత దూరం ఉందన్న వివరాలను సేకరించారు. నిందితులు దిశను శంషాబాద్ నుంచి ఎలా తీసుకొచ్చారు… ఆమె మృతదేహాన్ని ఎక్కడ దహనం చేశారన్న విషయాలను శంషాబాద్ డీసీపీ ప్రభాకర్ రెడ్డి దర్యాప్తు బృందానికి వివరించారు. 
నిన్న మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో నలుగురు నిందితుల మృతదేహాలను ఎన్ హెచ్ ఆర్ సీ బృందం పరిశీలించింది. మూడు గంటలకు పైగా ఆస్సత్రితోనే ఉన్న దర్యాప్తు బృందం..

నిందితులకు పాత గాయాలు ఉన్నాయా? పోలీస్ కస్టడీలో గాయాలు అయ్యాయా? ఎంత దూరం నుంచి కాల్పులు జరిగాయా? బుల్లెట్లతో మృతుల శరీరాల్లో ఏ మేరకు రంధ్రాలు ఏర్పడ్డాయి. నిందితులు పారిపోతున్నట్లు ధృవీకరించే ఆధారాలున్నాయా అన్న అంశాలపై ఆరా తీశారు.