కేంద్రంతో ఫైట్ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు తెలుగు ఎంపీలు రెడీ

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పార్టీలన్నీ తలమునకలయ్యాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించుకుని

  • Published By: veegamteam ,Published On : November 16, 2019 / 02:05 AM IST
కేంద్రంతో ఫైట్ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు తెలుగు ఎంపీలు రెడీ

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పార్టీలన్నీ తలమునకలయ్యాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించుకుని

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పార్టీలన్నీ తలమునకలయ్యాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించుకుని తమ  నేతలకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు ఆయా పార్టీల అధినేతలు. తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. తొలిసారి కేటీఆర్‌ అధ్యక్షతను నిర్వహించిన ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు.

నవంబర్ 18న నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు కేటీఆర్‌. ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన పెండింగ్‌ అంశాలతోపాటు రావాల్సిన నిధులు గురించి సమావేశాల్లో లేవనెత్తాలని నిర్ణయించారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు నిధులు, బయ్యారం ఉక్కు కర్మాగారంతోపాటు వివిధ ప్రాజెక్టులకు నిధులు రాబట్టే అంశంపై భేటీలో చర్చించామని టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. 

ఇటు వైసీపీ అధినేత, సీఎం జగన్‌ కూడా తమ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి మేలు చేసే ప్రతీ విషయంలో ఎంపీలు  ముందుండాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదా కోసం సభలో ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని చెప్పారు. పోలవరం నిధుల సత్వరమే  విడుదలయ్యేలా ప్రయత్నిస్తామన్నారు. అలాగే రామాయపట్నం పోర్టు, వెనుకబడిన జిల్లాల నిధుల కోసం పోరాటం చేస్తామన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలను ప్రస్తావిస్తామని వెల్లడించారు. 

మరోవైపు టీడీపీ ఎంపీలు కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పార్లమెంట్‌ ద్వారా దేశ ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు టీడీపీ ఎంపీలు గల్లా  జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు. రివర్స్ టెండరింగ్‌తో పాటు మీడియాపై ఆంక్షలు, ఇతర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు. మొత్తానికి పార్లమెంట్‌ సమావేశాలకు తమదైన రీతిలో సిద్ధమవుతున్నాయి రాజకీయ పార్టీలు. దీంతో ఈసారి శీతాకాల సమావేశాలు చాలా హాట్‌గా జరిగే అవకాశం కనిపిస్తోంది.