పేషెంట్ గా వచ్చి డాక్టర్ ను ముంచేశాడు: రూ.1.4కోట్లు దోపిడీ 

  • Published By: veegamteam ,Published On : September 20, 2019 / 05:20 AM IST
పేషెంట్ గా వచ్చి డాక్టర్ ను ముంచేశాడు: రూ.1.4కోట్లు దోపిడీ 

చిన్నపాటి అనారోగ్యానికే డాక్టర్లు పేషెంట్లను ఆ టెస్టులు..ఈ టెస్టులు అంటూ డబ్బులు పిండేస్తారని విన్నాం..చాలామంది ప్రత్యక్షంగా అనుభవించే ఉంటారు. కానీ డాక్టర్ నే ముంచేసిన ఓ మోసగాడి కథ వెలుగులోకి వచ్చింది.   డాక్టర్ తో పరిచయం పెంచుకుని కోట్ల రూపాయల్ని దోచేసిన వైనం బైటపడింది. పేషెంట్ లా వచ్చి డాక్టర్ నే ముంచేశాడు.
 
వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ నగరం. హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ గా జి.నాగశయన రావు దగ్గరకు రెండేళ్ల క్రితం  శ్రీకాకుళం జిల్లాకు చెందిన పీతాంబరం గుండె సమస్యలతో వచ్చాడు. డాక్టర్‌ రావు పీతాంబరానికి బైపాస్‌ సర్జరీ చేశారు. పీతాంబరం కూతురు కూడా డాక్టరే. దీంతో వీరిద్దరి మధ్యా పరిచయం కాస్తా  స్నేహం మారింది. అలా కొంతకాలానికి పీతాంబరం తన ఫ్రెండ్ అంటూ నల్లగొండకు చెందిన చామర్తి పట్టాభిరామ్ ను పరిచయంచేశాడు.  అలా ఇద్దరు కాస్తా ముగ్గురయ్యారు.ఈ క్రమంలో డాక్టర్ ను మోసం చేసేందుకు పీతాంబరం..పట్టాభిరామన్ ప్లాన్ వేశారు. వ్యాపారం చేద్దామంటూ డాక్టర్ ను నమ్మించారు. 

ప్రధానమంత్రి కృషి వికాస్‌ యోజన(పీఎంకేవై) పథకం కింద పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యాపారం చేద్దామంటూ నమ్మించారు. దీనికి ముగ్గురం కలిసి పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. ఈ వ్యాపారంలో ప్రతీ నెలా 24 శాతం లాభం వస్తుందనీ..ఆరు నెలల్లోనే పెట్టిన పెట్టుబడికి డబుల్ వచ్చేస్తుందని చెప్పారు. ఇదంతా డాక్టర్ రావు నమ్మాడు. దీంతో ముగ్గురూ కలిసి అన్నపూర్ణ ఆగ్రో బయోటెక్‌ పేరుతో ఓ కంపెనీ పెట్టారు. 

పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా ఉన్న ఐఏఎస్‌ డాక్టర్‌ పరితోష్‌ భట్టాచార్య, డైరెక్టర్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ పిజోష్‌ కాంతి ప్రమాణిక్‌ వర్క్‌ ఆర్డర్లు ఇచ్చారంటూ డాక్టర్ ని నమ్మించారు. దానికి సంబంధించిన ఫేక్ పేపర్స్ ని కూడా చూపెట్టారు. ప్రొడక్ట్స్ తయారు చేయాలంటే డబ్బు కావాలని మీ వాటాగా కొంత డబ్బు పెట్టుబడి పెట్టమని అడిగగా..డాక్టర్ 1.4 కోట్లు పట్టాభిమామన్ ఎకౌంట్ కు ట్రాన్సఫర్ చేశారు. ఆ తరువాత డాక్టర్ రావు వారికి ఫోన్ చేసిన ఇద్దరి నుంచీ ఎటువంటి స్పందనా లేదు. అలా వీరిద్దకి కోసం డాక్టర్ ఏడాదిన్నర ప్రయత్నించినా ఫలితం లేదు. 

దీంతో ఆయన రెండు నెలల క్రితం సీసీఎస్‌ను ఆశ్రయించిన డాక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. ఎఫ్‌–డివిజన్‌ ఏసీపీ జి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  ఇన్‌స్పెక్టర్‌ కె.మనోజ్‌కుమార్‌ ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ ను యూజ్ చేసి..పట్టాభిరామ్‌ ఢిల్లీ, ముంబై, చెన్నై ఉన్నట్లుగా గుర్తించారు. అతని  కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు హైదరాబాద్ కు వచ్చినట్లుగా గుర్తించి..పక్కా ప్లాన్ తో పట్టాభిరామ్ ను  బుధవారం (సెప్టెంబర్ 18)న అరెస్ట్ చేశారు. గతంలో కూడా ఇతను పలు మోసాలు చేసినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న  పీతాంబరానికి సీఆర్పీసీ 41–ఏ సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేశారు.కాగా అతను తనకు పక్షవాతం వచ్చినట్లుగా పోలీసులు విచారణలో తేలింది. పీతాంబరాన్నీ నిందితుడిగా పరిగణిస్తూ  దర్యాప్తు పూర్తయిన అనంతరం దానికి సంబంధించిన పేపర్లను కోర్టుకు సమర్పిస్తామని సీసీఎస్‌ పోలీసులు తెలిపారు.