ఆ రోజే గన్ తో కాల్చుకుని చనిపోదామనుకున్నా

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతాన్ని గుర్తు చేసుకున్నారు. తన అన్న చిరంజీవి ఏ విధంగా తనకు అండగా

  • Published By: veegamteam ,Published On : August 22, 2019 / 04:12 AM IST
ఆ రోజే గన్ తో కాల్చుకుని చనిపోదామనుకున్నా

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతాన్ని గుర్తు చేసుకున్నారు. తన అన్న చిరంజీవి ఏ విధంగా తనకు అండగా

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకల్లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతాన్ని గుర్తు చేసుకున్నారు. తన అన్న చిరంజీవి ఏ విధంగా తనకు అండగా నిలిచాడో చెప్పారు. ఇంటర్‌ ఫెయిల్‌ అయినప్పుడు నిరాశ చెందానని, అన్నయ్య దగ్గరున్న లైసెన్స్‌ పిస్టోల్‌ తో కాల్చుకుని చనిపోదామనుకున్నానని పవన్ తెలిపారు. ఆ రోజు అన్నయ్య చెప్పిన మాటలు తనలో విశ్వాసం నింపాయన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నవాళ్ల ఇళ్లల్లోనూ చిరంజీవిలాంటి అన్నయ్యలు ఉంటే అలాంటి ఘటనలు జరిగేవికాదన్నారు. తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించిందన్న పవన్.. తనకూ అలాంటి సందర్భమే ఎదురైందని చెబుతూ గతాన్ని తలుచుకున్నారు.

ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా బుధవారం(ఆగస్టు 21,2019) హైదరాబాద్‌లో ఫ్యాన్స్ మధ్య చిరు పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. పవన్‌ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. చిరంజీవి అభిమానుల్లో ఒకడిగా వచ్చానని పవన్ చెప్పారు. తన జీవితంలో తనకు స్ఫూర్తిప్రదాత చిరంజీవి అని తెలిపారు. ఓ అభిమానిగా ఆయన్ని ఎలాంటి సినిమాలో చూడాలని కోరుకున్నానో అలాంటి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ అన్నారు. ఈ సినిమాలో నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు పనిచేశారని చెప్పారు. ఒకరు అన్నయ్య, మరొకరు అమితాబ్‌ బచ్చన్ అన్నారు. తన జీవితంలో 3 సందర్భాల్లో తప్పుడు మార్గం వైపు వెళ్లకుండా అన్నయ్య కాపాడారని పవన్ వెల్లడించారు. 

యుక్త వయసులో ఉన్న సమయంలో దేశాన్ని ఎవరైనా ఏమైనా అంటే కోపంతో ఊగిపోయేవాడిని అని పవన్ చెప్పారు. ఆ సమయంలో ‘నువ్వు కులం, మతం దాటి మానవత్వం వైపు ఆలోచించాలి’ అని అన్నయ్య హితబోధ చేశారని అన్నారు. 22 ఏళ్ల వయసులో ఓ ఆశ్రమంలో చేరిపోదామని అనుకున్నానని పవన్ తెలిపారు. నువ్వు దేవుడివైపు వెళ్లిపోతే సమాజానికి ఎందుకూ ఉపయోగపడవు.. బాధ్యతలు ఉంటే ఈ మాటలు మాట్లాడవు అని అన్నయ్య నన్ను ఆపారు, ఆ మాటలే ఈరోజు మీ ముందు నిలబడేలా చేశాయి అని పవన్ అన్నారు.

‘సైరా’ లాంటి గొప్ప సినిమాకి వాయిస్ ఇవ్వడం తన అదృష్టం అన్నారు పవన్. అన్నయ్య ఇలాంటి సినిమా చేయాలని కలలు కన్నాను అని చెప్పారు. ఇలాంటి గొప్ప సినిమా తీసే శక్తి, సమర్థత నాకు లేకపోయాయన్న పవన్.. నా తమ్ముడు లాంటి రామ్‌చరణ్‌ ఈ పని చేశాడని ప్రశంసించాడు. ఏ తండ్రయినా తనయుడ్ని లాంచ్‌ చేస్తారు. కానీ ఇక్కడ కొడుకే తండ్రిని లాంచ్‌ చేశాడని కితాబిచ్చారు. సురేందర్‌రెడ్డి ఈ సినిమాతో తన కలని సాకారం చేసుకున్నారని జనసేనాని పవన్ చెప్పారు.