నేను తెలంగాణలో పుట్టి ఉంటే : ఏపీ పాలకులకు చుక్కలు చూపించేవాడిని

హైదరాబాద్ : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. తెలంగాణ ఉద్యమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దోపిడీ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 03:35 PM IST
నేను తెలంగాణలో పుట్టి ఉంటే : ఏపీ పాలకులకు చుక్కలు చూపించేవాడిని

హైదరాబాద్ : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. తెలంగాణ ఉద్యమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దోపిడీ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ

హైదరాబాద్ : జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్.. తెలంగాణ ఉద్యమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దోపిడీ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు. అదే సమయంలో ఆంధ్రా పాలకులు వేరు, ఆంధ్రా ప్రజలు వేరు అనే విషయాన్ని గుర్తించాలని.. పాలకులు చేసిన తప్పులకు ప్రజలను నిందించకూడదని పవన్ విజ్ఞప్తి చేశారు. కొందరు తెలంగాణ నాయకులు ఏపీ ప్రజలను నిందించడం తనకు నచ్చలేదన్నారు. పద్ధతి మార్చుకోవాలని పవన్ సూచించారు. తెలంగాణ ఉద్యమం నా చేతుల్లో ఉండి ఉంటే.. ఆంధ్రా పాలకులకి చుక్కలు చూపించే వాడిని అని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలంగాణలో పుట్టకపోవడం తన దురదృష్టం అని వాపోయిన పవన్.. తెలంగాణలో(కరీంనగర్) పునర్ జన్మ తీసుకున్నానని గుర్తు చేశారు. ఎల్బీ స్టేడియంలో బీఎస్పీ చీఫ్ మాయావతితో కలిసి పవన్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.

రాష్ట్ర విభజన తనకు బాధతో పాటు ఆనందం కూడా కలిగించిందన్నారు. ప్రజల మధ్య విద్వేషం ఉండకూడదని పవన్ కోరుకున్నారు. తెలంగాణలో దళిత సీఎం కోరిక నెరవేరలేదన్నారు. దోపిడీ వ్యవస్థ ఆంధ్రా పాలకుల్లో ఉన్నా, తెలంగాణ పాలకుల్లో ఉన్నా కచ్చితంగా నిలువరించాల్సిందే అన్నారు. ప్రతిపక్షం లేకుండా పరిపాలన సాగాలంటే ఎలా? అని పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఒక పార్టీని నడిపించాలంటే వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉందన్నారు. ఉద్యోగాల విషయంలో ఓయూ విద్యార్ధుల్లో ఆవేదన ఉందన్నారు. ప్రధాని మోడీ.. భయపెట్టి పాలించడం తనకు నచ్చలేదన్నారు.

కాన్షీరామ్ స్ఫూర్తితో జనసేన పార్టీని స్థాపించానని పవన్ చెప్పారు. మాయావతికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, ఓ సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని పవన్ ప్రశంసించారు. తెలంగాణలో పుట్టకపోవడం నా దురదృష్టం అన్న పవన్.. తెలంగాణలో(కరీంనగర్) పునర్ జన్మ పొందిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.