పవన్ కల్యాణ్ కు వడదెబ్బ : ఆందోళనలో అభిమానులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వడదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లాలో ప్రచారం చేస్తుండగా జ్వరం వచ్చింది.

  • Published By: vamsi ,Published On : April 5, 2019 / 01:07 PM IST
పవన్ కల్యాణ్ కు వడదెబ్బ : ఆందోళనలో అభిమానులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వడదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లాలో ప్రచారం చేస్తుండగా జ్వరం వచ్చింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వడదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లాలో ప్రచారం చేస్తుండగా జ్వరం వచ్చింది. ఎండలను సైతం లెక్కచేకుండా వరసగా తిరుగుతుండటంతో తీవ్ర అలసటకు కూడా గురయ్యారు పవర్ స్టార్. నీరసంగా ఉన్న పవన్ కు పరీక్షలు నిర్వహించారు వైద్యులు.

వడదెబ్బ తగిలిందని.. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, తెనాలి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. బెజవాడలోని ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు.  పవన్ కల్యాణ్ కు వడదెబ్బ తిగిలింది అనే విషయం తెలిసిన అభిమానులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు.
Read Also : అభిమాని అత్యుత్సాహం.. కిందపడ్డ పవన్ కళ్యాణ్

ఆయన వెంటనే కోలుకుని ప్రచారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. మరో 4 రోజుల్లో పోలింగ్ ఉన్న సమయంలో.. అధినేత ఇలా అనారోగ్యం బారిన పడటంతో ఆందోళన చెందుతున్నారు జనసేన కార్యకర్తలు, నేతలు. రెండు నియోజకవర్గాల్లో ప్రచారానికి కూడా బ్రేక్ ఇచ్చారు.

డాక్టర్లు ఇంట్లోనే ఉండి ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. కేవలం వడదెబ్బ మాత్రమే తగిలిందని.. కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలని చెబుతున్నారు. ఏప్రిల్ 5వ తేదీ ఉగాది పండుగ కూడా ఉంది. దీంతో పండుగ రోజు ప్రచారం చేస్తారా లేదా.. విశ్రాంతి తీసుకుంటారా అనేది ఇంకా ప్రకటించలేదు జనసేన పార్టీ.
Read Also : అగ్రిగోల్డ్‌పై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు : జగన్‌కు పవన్ క్వశ్చన్