వావి వరసలు మరిచి…. కూతురు వరసయ్యే బాలికపై లైంగిక వేధింపులు…… అరెస్ట్

10TV Telugu News

pet father sexually abusing : మహిళలపై నానాటికీ దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ లో సాఫ్టేవేర్ కంపెనీలో పని చేసే ఉద్యోగి కూతురు వరసయ్యే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆవ్యక్తిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ లో నివసించే జయరాం ప్రసాద్ (40) అనే వ్యక్తికి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నాడు. 2013లో భార్య చనిపోవటంతో….తన 14 ఏళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా జీవిస్తున్నాడు. రెండో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో 2015లో నేరేడ్ మెట్ కే చెందిన ఓ మహిళను రెండో వివాహాం చేసుకున్నాడు.ఆ మహిళ భర్త నుంచి విడిపోయి17 ఏళ్ల కుమార్తె తో ఒంటరిగా జీవిస్తోంది. ప్రసాద్ ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత…తన 17 ఏళ్ల కుమార్తెతో సహా ప్రసాద్ ఇంటికి వచ్చి జీవనం సాగిస్తోంది. అయితే కొన్నేళ్లుగా జయరాం ప్రసాద్ తన రెండో భార్య కూతురిపై కన్నేశాడు. భార్యకు తెలియకుండా బాలికపై లైంగిక వేధింపులు ప్రారంభించాడు.బాలిక ఈవిషయాన్నితల్లికి చెప్పటంతో ఆమెతన కుమార్తెను బంధువుల ఇంటివద్దకుపంపించింది. దీంతో అప్పటినుంచి జయరాం ప్రసాద్ భార్యను కూడా వేధించటం మొదలు పెట్టాడు. కూతురిని తిరిగి ఇంటికి తీసుకురావాలని భార్యపై ఒత్తిడి చేయసాగాడు. ప్రసాద్ వేధింపులు భరించలేని భార్య నేరేడ్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రసాద్ ను అరెస్ట్ చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

10TV Telugu News