కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం : సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 10:58 AM IST
కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం : సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది మల్లేశ్వర్ రావు, బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. విలీనాన్ని ఆమోదిస్తూ శాసన మండలి విడుదల చేసిన బులెటిన్ నెం-9ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. 

పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు.. అసెంబ్లీ లా సెక్రటరీ, మండలి ఛైర్మన్, తెలంగాణ చీఫ్ సెక్రటరీ, ఎమ్మెల్సీ ప్రభాకర్, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, సంతోష్ రెడ్డిలతోపాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో వీటికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని నోటీస్ లో వెల్లడించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా ఉంటూ టీఆర్ఎస్ లో విలీనం కావడానికి సంబంధించి వివరణ ఇవ్వాలని తెలిపింది. మరి వారు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది కోర్టు.