న్యాయం కోసం : ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

న్యాయం కోసం : ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

Petition Inter Results Highcourt 10083

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాలల హక్కుల సంఘం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. మంగళవారం (ఏప్రిల్ 23,2019) మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది. ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంగా కారణంలో ఫలితాల్లో అనేక తప్పులు జరిగాయి. అనేకమంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. జిల్లా టాపర్లకు సున్నా మార్కులు వచ్చాయి. ఒక సబ్జెక్ట్ లో పరీక్ష రాస్తే మరో సబ్జెక్ట్ లో ఫలితాలు ఇచ్చారు. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో తెలంగాణ వ్యాప్తంగా 16మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇంటర్ బోర్డు అధికారుల తీరుని నిరసిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు 4 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. తమ పిల్లలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంటర్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరిపించి చర్యలు తీసుకునేలా హైకోర్టు ఆదేశాలు జారీ చెయ్యాలని కోరుతూ బాలల హక్కుల సంఘం నేత అచ్యుతరావు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2.15 గంటలకు పిటిషన్ ను విచారిస్తామని కోర్టు తెలిపింది. ఇంటర్ ఫలితాలు వచ్చాక ఇప్పటివరకు 16మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారందరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చెయ్యాలని అచ్యుతరావు కోరారు. ఇంటర్ జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేసిన గ్లోబరీనా సంస్థపైనా కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు.