రాష్ట్రంలో నిషేధం : ప్రధాని మోడీ బాటలో సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని సీఎం కేసీఆర్

  • Published By: veegamteam ,Published On : October 10, 2019 / 11:05 AM IST
రాష్ట్రంలో నిషేధం : ప్రధాని మోడీ బాటలో సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణానికి పెను ముప్పుగా మారిన ప్లాస్టిక్ పై నిషేధం విధించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రివర్గంలో చర్చించాక ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎం తెలిపారు. ప్లాస్టిక్ బ్యాన్ కి సంబంధించి అవసరమైన విధివిధానాలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ పై నిషేధం విధించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం అయ్యారు. పంచాయతీలకు ప్రతి నెల రూ.339 కోట్ల నిధులు విడుదల చేస్తామన్నారు. చెట్ల పెంపకం, చెత్త వేరు చేసే పనులకు ఆ నిధులను వాడుకోవాలన్నారు. గ్రామాల్లోకి కోతులు రాకుండా మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి, మానవాళికి పెద్ద ముప్పుగా మారాయి. భూమి, గాలి, నీరు, ఆహారం.. ఇలా అన్ని కలుషితమవుతున్నాయి. ప్లాస్టిక్‌ తయారీ దశ నుండి సముద్రాలను చేరే దశవరకు కణాలుగా గాలిలో కలుస్తోంది. విష రసాయనాలను విడుదల చేస్తోంది. దీంతో పర్యావరణం కాలుష్యం అవుతోంది. ప్లాస్టిక్‌ పదార్థాలు చిన్న, మధ్యతరహా, 5.5 ట్రిలియన్‌ ప్లాస్టిక్‌ ముక్కలు సముద్రాలపై తేలియాడుతున్నాయి. ప్రతి ఏటా 8.8 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయి. 1950 నుండి 2018 వరకు ప్రపంచంలో 6.3 బిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి కాగా ఇందులో 9శాతం రీసైకిల్‌ అయ్యింది. 12 శాతం మండించారు. మన దేశంలో 2017-18లో 5వేల 500 టన్నుల ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేశారు. ఇది మొత్తం ఉత్పత్తిలో 60 శాతం. 2022 నాటికి ఆరు రకాల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్స్‌ను పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వ ఆలోచన. స్పూన్లు, కప్పులు, స్ట్రాలు, బాటిల్స్‌, క్యారీ బ్యాగులు.. దేశంలోని మొత్తం ప్లాస్టిక్‌ వ్యర్థాలలో 50శాతం వీటి వల్లే జరుగుతోంది.

ప్లాస్టిక్‌ కాలుష్యం జీవజాతుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. దేశంలోని పంపునీటిలో 72 శాతం ప్లాస్టిక్‌ రేణువులు ఉన్నట్లు తేలింది. ఒక వ్యక్తి సంవత్సరానికి 3 వేల నుండి 4 వేల సూక్ష్మప్లాస్టిక్‌ కణాలను లేదా 250 గ్రాముల బరువు గల ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నారని తేలింది. ఈ కాలుష్యం నీటి వనరుల్లో చేరి చేపల ద్వారా మన ఆహారంలోకి ప్రవేశిస్తుంది. ప్లాస్టిక్‌ వల్ల మురికి చేరి దోమలు పెరుగుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. మన శరీరంలో హార్మోన్‌ వ్యవస్థ దెబ్బతింటోంది. ఎండోక్రైన్‌ వ్యాధులు వస్తున్నాయి. వ్యంధత్వానికి దారితీస్తోంది. 2019లో ప్లాస్టిక్‌, పర్యావరణ నివేదిక ప్రకారం ప్లాస్టిక్‌ కాలుష్యం వల్ల 850 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌కు సమానమైన గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారం జరిగింది.