శభాష్ పోలీస్.. పరిగెత్తి ప్రాణం కాపాడాడు..

  • Edited By: vamsi , November 4, 2020 / 07:27 PM IST
శభాష్ పోలీస్.. పరిగెత్తి ప్రాణం కాపాడాడు..

హైదరాబాద్ నగరంలో మానవత్వం చాటుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. ప్రాణాపాయ స్థితిలో ఓ వ్యక్తిని తీసుకెళుతున్న అంబులెన్సును ఆసుపత్రికి చేర్చేందుకు కష్టపడి తన మానవత్వం చాటుకున్నాడు ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అతను చేసిన పనికి ప్రశంసిస్తుంది.హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అయిన బాబ్జి.. నిత్యం రద్దీగా ఉండే మొజంజాహి మార్కెట్ నుంచి కోఠి వెళ్లే దారిలో ఓ అంబులెన్స్‌ ట్రాఫిక్‌లో చిక్కుకోవడం గమనించి, వెంటనే దానికి దారి క్లియర్ చేసేందుకు చాలా కష్టపడ్డాడు. ఆంబులెన్స్ ముందు పరిగెడుతూ దారి క్లియర్ చేసి ప్రాణాపాయ స్థితిలో ట్రాఫిక్‌లో చిక్కుకున్నవారు ఆసుపత్రికి చేరుకొనేందుకు సాయపడ్డాడు.దీంతో సమయానికి ఆసుపత్రికి చేరుకున్న పేషెంట్ ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డారు. దీంతో వారి ప్రాణాలు కాపాడిన ఆ కానిస్టేబుల్ సహాయానికి కృతజ్ఞతగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తికి పోలీస్ ఉన్నతాధికారులతో పాటు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానిస్టేబుల్ చేసిన పనిని పోలీస్ ఉన్నత అధికారులు కూడా ప్రశంసిస్తున్నారు.