Gold Car : కారా? బంగారం షాపా? డ్యాష్ బోర్డులో 25 కిలోల గోల్డ్ బిస్కెట్లు

Gold Car : కారా? బంగారం షాపా? డ్యాష్ బోర్డులో 25 కిలోల గోల్డ్ బిస్కెట్లు

Gold Car

Gold Car : హైదరాబాద్ శివారులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర కారు డ్యాష్ బోర్డులో బంగారాన్ని డీఆర్ఏ అధికారులు పట్టుకున్నారు. కారులో బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.

కారులో బంగారం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో డీఆర్ఏ అధికారులు రంగంలోకి దిగారు. హైవే పై వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పంతంగా టోల్ ప్లాజా దగ్గర తనిఖీలు చేస్తుండగా ఓ కారులో బంగారం దొరికింది. కారు ఇన్ సైడ్ భాగంలో అంటే క్యాష్ డ్యాష్ బోర్డులో గోల్డ్ బిస్కెట్లు దాచి ఉంచారు. డ్యాష్ బోర్డు తెరిచి చూడగా అధికారులు విస్తుపోయారు. అందులో ఏకంగా 25 కిలోల బంగారం ఉంది. కోల్ కతా నుంచి చెన్నైకి బంగారం తరలిస్తున్న అధికారులు గుర్తించారు.