ఎన్‌కౌంటర్ల తర్వాత పోలీసుల కష్టాలు : సినిమా కనిపిస్తుంది

ఎన్‌కౌంటర్.. సినిమాల్లో మాత్రమే హీరోయిజం. రియల్‌ లైఫ్‌లో అస్సలు కాదు. ఎన్‌కౌంటర్‌లో పార్టిసిపేట్ చేసిన పోలీసులకు... ఆ తర్వాతే అసలు సినిమా కనిపిస్తుంది. ఇంతకీ

  • Published By: veegamteam ,Published On : December 10, 2019 / 03:19 AM IST
ఎన్‌కౌంటర్ల తర్వాత పోలీసుల కష్టాలు : సినిమా కనిపిస్తుంది

ఎన్‌కౌంటర్.. సినిమాల్లో మాత్రమే హీరోయిజం. రియల్‌ లైఫ్‌లో అస్సలు కాదు. ఎన్‌కౌంటర్‌లో పార్టిసిపేట్ చేసిన పోలీసులకు… ఆ తర్వాతే అసలు సినిమా కనిపిస్తుంది. ఇంతకీ

ఎన్‌కౌంటర్.. సినిమాల్లో మాత్రమే హీరోయిజం. రియల్‌ లైఫ్‌లో అస్సలు కాదు. ఎన్‌కౌంటర్‌లో పార్టిసిపేట్ చేసిన పోలీసులకు… ఆ తర్వాతే అసలు సినిమా కనిపిస్తుంది. ఇంతకీ ఎన్‌కౌంటర్ అంటే ఏంటి? ఆ తర్వాత ఖాకీలకు ఎదురయ్యే ఇబ్బందులేంటి..?

ఎన్‌కౌంటర్‌తో హీరోయిజమే కాదు.. కష్టాలు కూడా వస్తాయి. జస్టిస్ ఫర్ దిశ లాంటి కేసుల్లో జరిగే ఎన్‌కౌంటర్లతో పోలీసులు హీరోలు అవుతుంటారు. ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి ఇంటాబయట ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, ఆ తర్వాతే అసలు కష్టాలు మొదలవుతాయి. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. తమను తాము నిర్దోషులుగా నిరూపించుకునే ప్రక్రియలో పోలీసులకు తల ప్రాణం తోకకు వస్తుంది. ఎన్‌కౌంటర్ జరిగిన వెంటనే సంబంధిత పోలీసులపై సెక్షన్ 302 కింద హత్యానేరం నమోదవుతుంది. నిబంధనల మేరకు ప్రభుత్వం నుంచి గానీ… పోలీసు శాఖ నుంచి గానీ వారికి న్యాయసాయం అందదు. కేసు సుప్రీంకోర్టు వరకు వెళితే.. ఢిల్లీకి వచ్చిపోయే ఖర్చులతో పాటు భారీగా పుచ్చుకునే సుప్రీంకోర్టు అడ్వకేట్లకు ఫీజులు కట్టాల్సి ఉంటుంది. కొంతమందికైతే రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్‌కౌంటర్ తాలూకు ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి.

ఎన్‌కౌంటర్ చేస్తే పోలీసులపై ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుంది. ఒక వ్యక్తి తన ప్రాణాలకు ఎదుటి వారి నుంచి ముప్పు ఉన్నట్లు భావిస్తే… ఆత్మరక్షణలో భాగంగా వారిని చంపేయవచ్చు. ఇదే సూత్రం పోలీసులకు కూడా వర్తిస్తుంది. అందుకే ఎదుటి వారి నుంచి ముప్పు ఏర్పడటం వల్లే… ఫైర్ చేసి హతమార్చి ఎన్‌కౌంటర్ చేశామని చెప్తుంటారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులోనూ పోలీసులపై హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్‌హెచ్ఆర్‌సి కూడా విచారణ జరుపుతోంది. ఈ విచారణ పూర్తయి నిర్దోషులుగా తేలే వరకు సదరు పోలీసులకు పదవీ విరమణ ప్రయోజనాలు దక్కవు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులతో పాటు కేసును పర్యవేక్షించే అధికారులకు కూడా వ్యక్తిగతంగా ఇబ్బందులుంటాయి. పర్యవేక్షించే అధికారులకు కూడా కేసు తేలే వరకు పదవీ విరమణ ప్రయోజనాలు అందవు.

కొన్ని సందర్భాల్లో తమను తాము నిరూపించుకోలేక ఉద్యోగం పోగొట్టుకుని జైలుపాలైన పోలీసు అధికారులు కూడా ఉన్నారు. జైలు శిక్షతో పాటు పదవీ విరమణ ప్రయోజనాల నుంచి బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని తీర్పులు కూడా వచ్చాయి. మొత్తానికి ఎన్‌కౌంటర్ అనేది అంత ఈజీ కాదు. అకారణంగా ఎదుటివారి ప్రాణాలు ఎవరు తీసినా శిక్ష తప్పదు.

* ఎన్‌కౌంటర్ల తర్వాత పోలీసులకు చిక్కులు
* నిర్దోషులుగా నిరూపించుకోవాల్సిన బాధ్యత పోలీసులదే
* ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై సెక్షన్ 302 కింద హత్యానేరం నమోదు
* ప్రభుత్వం నుంచి, పోలీసు శాఖ నుంచి న్యాయసాయం అందదు
* కేసు సుప్రీంకోర్టు వరకు వెళితే అడ్వకేట్లకు భారీగా ఫీజులు కట్టాల్సిందే
* నిర్దోషులుగా తేలే వరకు పదవీ విరమణ ప్రయోజనాలు దక్కవు
* కేసును పర్యవేక్షించే అధికారులకు సైతం ఇబ్బందులు
* ఉద్యోగం పోగొట్టుకుని జైలుపాలైన కొందరు ఆఫీసర్లు