మహిళలూ..మీ హ్యాండ్ బ్యాగ్ లో కారంపొడి, కత్తి పెట్టుకోండి : DCP సుమతి

  • Published By: veegamteam ,Published On : November 29, 2019 / 08:47 AM IST
మహిళలూ..మీ హ్యాండ్ బ్యాగ్ లో కారంపొడి, కత్తి పెట్టుకోండి : DCP సుమతి

అమ్మాయిలు..మహిళలు ఆత్మరక్షణ కోసం వారి హ్యాండ్ బ్యాగ్ లలో కారంపొడి,చిన్న చాకు, పెప్పర్ స్ప్రే, స్టన్ గన్ వంటివి పెట్టుకోవాలని హైదరాబాద్ డీసీపీ సుమతి సూచించారు. పనులపై రాత్రి సమయాలలో బైటకు వెళ్లినా ఉద్యోగరీత్యా వెళ్లినా..లేట్ అయినా..కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలనీ..మొబైల్ లొకేషన్ షేర్ చేయాలనీ..ప్రమాదంలో ఉన్నామనిపిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని..సూచించారు. 

ప్రతీ రోజు ఒకే ప్రాంతానికి వెళ్లితే మరింత జాగ్రత్తగా ఉండాలనీ..ప్రమాదాలను గుర్తిస్తుండాలని అనుక్షణం అప్రమత్తంగా ఉండాలనీ..పరిచయం లేని వ్యక్తుల్ని గుడ్డిగా నమ్మవద్దని..ఒంటిరిగా ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లవద్దనీ సూచించారు. 

మహిళల రక్షణ కోసం అనుక్షణం సిద్ధంగా ఉన్నారని పోలీసులు అభయమిస్తున్నారు. ప్రమాదంలో ఉన్న సమయంలో డయల్ 100, 112, 9490617111, షీ టీమ్స్‌ ల్యాండ్‌ లైన్‌ నంబరు 040-2785 2355, వాట్సాప్‌ నంబరు 9490616555కు సమాచారం ఇచ్చినా వారు వెంటనే సాయం అందిస్తారు.టోల్‌ ఫ్రీ నంబర్లు 112, 1090, 1091 నంబర్లకు కూడా ఫోన్‌ చేయవచ్చని సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల ప్రారంభించిన 112 ఎమర్జెన్సీ నంబర్‌కు ఫోన్‌చేస్తే అన్నిరకాల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

సమాజంలో మహిళలపై దారుణాలు పెరిగిపోతున్న క్రమంలో పోలీసులు యువతులకు..మహిళలకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం, పుట్టిన రోజున దారుణంగా గ్యాంగ్ రేప్ కు గురైన వరంగల్ జిల్లా మానస కేసులతో పాటు మహిళలపై జరగుతున్న అఘాయిత్యాలు జరుగుతున్న క్రమంలో ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాబట్టి ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.