కట్టలే కట్టలు : హైదరాబాద్‌లో రూ.కోటి 34లక్షలు స్వాధీనం

  • Published By: veegamteam ,Published On : April 6, 2019 / 03:59 PM IST
కట్టలే కట్టలు : హైదరాబాద్‌లో రూ.కోటి 34లక్షలు స్వాధీనం

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడింది. ఈ తరుణంలో నోట్ల కట్టలు కలకలం రేపుతున్నాయి. పోలీసుల వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. బంజారాహిల్స్ లో పోలీసుల తనిఖీల్లో కోటి రూపాయల నగదు పట్టుబడింది. ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి నుంచి ఆ నగదు స్వాధీనం చేసుకున్నారు. మలక్ పేటలో ఓ కారులో తరలిస్తున్న రూ.34లక్షలు దొరికాయి. కృష్ణా రెడ్డి, రవి అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు ఆ నగదుని సీజ్ చేశారు. ఈ డబ్బు ఎవరిది? ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

ఎన్నికల వేళ కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల సోదాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. లెక్కల పత్రాలు లేని క్యాష్ బయటపడుతోంది. దీంతో పోలీసులు ఆ డబ్బుని స్వాధీనం చేసుకుంటున్నారు. ఏప్రిల్ 4న బంజారాహిల్స్ లో రూ.3కోట్ల నగదు పట్టుబడింది. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థ ఉద్యోగుల నుంచి పోలీసులు రూ.2కోట్లు స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది. MMTS లో డబ్బు తరలించే ప్రయత్నంలో ఉండగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు పట్టుకున్నారు.