బహుపరాక్ : ఎన్నికలపై పోలీసుల డేగకన్ను

  • Published By: madhu ,Published On : March 29, 2019 / 03:04 AM IST
బహుపరాక్ : ఎన్నికలపై పోలీసుల డేగకన్ను

లోక్ సభ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగబోతున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, స్వేచ్చగా ఓటు హక్కు వేసే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంపై మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు నిఘా పెట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అధికారులు రాజకీయ పార్టీలు, నేతలపై డేగకన్ను వేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. 

పాతబస్తీతో పాటు కొన్ని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై నగర పోలీసు యంత్రంగా ప్రత్యేక నజర్ పెట్టింది. ప్రత్యేక మొబైల్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్‌‌లకు చెందిన సిబ్బంది సైత ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేసి నివేదికలను తయారు చేస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో డిజిటల్, వీడియో కెమెరాలున్నాయి. వీటికి తోడు మరిన్ని ప్రైవేటు కెమెరాలను రెంట్‌కు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. అత్యంత సున్నిత, సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. 

సమస్యాత్మక ప్రాంతాల్లో జీపీఎస్ వాహనాలను వినియోగించాలని పోలీసు అధికారులు డిసైడ్ అయ్యారు. సీసీ కెమెరాలను విస్తృతంగా ఉపయోగించాలని, ఈ కెమెరాలతో కార్యకర్తలు, అభ్యర్థుల కదలికలను గమనించవచ్చని..సిబ్బందికి పలు సూచనలు చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో డిజిటల్, వీడియో కెమెరాలున్నాయి. వీటికి తోడు మరిన్ని ప్రైవేటు కెమెరాలను రెంట్‌కు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన కమిషనరేట్లలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లలో వీటిని రికార్డు చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రతి ఘట్టాన్ని రికార్డు చేయాలని నిర్ణయించారు. ఏ దశలోనూ ఉల్లంఘనలకు తావు లేకుండా, అలాంటి వాటికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఆధారాలుగా వినియోగించుకోవడం కోసం ఈ ఫీడ్‌ను వాడనున్నారు. 

మరోవైపు ప్రింటింగ్ ప్రెస్‌లపై కూడా నిఘా పెట్టారు పోలీసులు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచారానికి సంబంధించి కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీల ప్రింట్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దృష్టి పెట్టాల్సిన అంశాలను ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాలకు పోలీసులు వివరిస్తున్నారు. ముద్రించే ప్రతిదానిపైనా ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ పేరు, ఏ పార్టీ / ఏ అభ్యర్థి కోసం ముద్రిస్తున్నారో పూర్తి వివరాలు తప్పకుండా ముద్రించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ నిబంధనలను అమలుచేయని వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసు శాఖ రెడీ అవుతోంది.