టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు, ముళ్ల కంచెలు : పోలీసుల ఆధీనంలోకి ట్యాంక్ బండ్

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ నిర్మానుష్యంగా మారింది. పోలీసులు ట్యాంక్ బండ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టియర్ గ్యాస్, వాటర్ కేన్లను సిద్ధం చేశారు.

  • Published By: veegamteam ,Published On : November 9, 2019 / 10:13 AM IST
టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు, ముళ్ల కంచెలు : పోలీసుల ఆధీనంలోకి ట్యాంక్ బండ్

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ నిర్మానుష్యంగా మారింది. పోలీసులు ట్యాంక్ బండ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టియర్ గ్యాస్, వాటర్ కేన్లను సిద్ధం చేశారు.

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ నిర్మానుష్యంగా మారింది. పోలీసులు ట్యాంక్ బండ్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టియర్ గ్యాస్, వాటర్ కేన్లను సిద్ధం చేశారు. ట్యాంక్ బండ్ చుట్టూ బారికేడ్లు,  కంచెలు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ మీదకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ట్యాంక్ బండ్ మీదకు చేరుకోక ముందే ఆందోళనకారులను  పోలీసులు చెదరగొట్టారు. ట్యాంక్ బండ్ పైకి ఎవరినీ రానియ్యకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ నిర్మానుష్యమైన వాతావరణం నెలకొంది. ట్యాంక్ బండ్ పైకి కానీ, విగ్రహాల దగ్గరికి కానీ ఎవరూ చేరుకోలేదని పోలీసులు తెలిపారు.

ట్యాంక్‌బండ్‌పై సామూహిక దీక్షకు యత్నించిన ఆర్టీసీ కార్మికులు, విపక్ష నేతలను పోలీసులు చెదరగొట్టారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌, వామపక్ష నేతలు కూనంనేని సాంబశివరావు, ఆర్టీసీ జేఏసీ కన్వీకర్‌ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌ దగ్గర ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. దీంతో పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. ప్రస్తుతం ట్యాంక్‌ బండ్‌పై పరిస్థితి ప్రశాంతంగా ఉందని పోలీసులు తెలిపారు.

సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికుల జేఏసీ శనివారం(నవంబర్ 9,2019) చలో ట్యాంక్ బండ్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కార్మికులు ఒక్కసారిగా ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి చొచ్చుకుని వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ట్యాంక్ బండ్ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం కనిపించింది. ఊహించని విధంగా ఆందోళనకారులు దూసుకొచ్చారు. బారికేడ్లు తోసుకుని ముందుకెళ్లారు. ఇంతలో అలర్ట్ అయిన పోలీసులు.. ట్యాంక్ బండ్ పైకి ఆందోళనకారులు చేరుకునేలోపే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆందోళనకారులు, పోలీసులు మధ్య వాగ్వాదం, తోపులాటలు జరగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు లిబర్టీ దగ్గర ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. పోలీసులపై రాళ్లు విసిరారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు టియర్ గ్యాప్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.