హెల్మెట్ పెట్టుకుంటే చాలు.. ఇక రోడ్లపై పోలీసులు బండి ఆపరు

  • Published By: vamsi ,Published On : September 13, 2019 / 02:56 PM IST
హెల్మెట్ పెట్టుకుంటే చాలు.. ఇక రోడ్లపై పోలీసులు బండి ఆపరు

రోడ్లపై వాహనాలు నడపాలంటే ఏ సందు చివర ట్రాఫిక్ పోలీసులు ఉంటారో అనే భయం ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ఏ చిన్న పత్రం లేకపోయినా కూడా భయపడిపోతూ ఉంటారు పోలీసులు. అయితే ఒక్క హెల్మెట్ కొనుక్కోండి కొన్నిరోజులు పాటు అటువంటి భయం లేకుండా బండి నడుపుకోవచ్చు. అవును ఇది నిజమే… హెల్మెట్ ధరించి వాహనాలను నడుపేవారికి పోలీసు ఉన్నతాధికారులు బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు.

అదేమిటంటే… హెల్మెట్ ధరించి ప్రయాణించే వాహనదారులను ఇకపై ఇతర పత్రాల కోసం చెక్ చేయరట. ఖమ్మం కమీషనరేట్ పరిధిలో కొన్ని రోజుల పాటు ఈ ఆఫర్ ఇస్తున్నారు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. హెల్మెట్‌ ఎంత ముఖ్యమో తెలియజేసేందుకు హెల్మెట్ వాడకాన్ని మరింత పెంచాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ వెల్లడించారు.

హెల్మెట్ ధరించకపోవడం కారణంగా జరుగుతున్న ప్రమాదాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న పోలీసులు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హెల్మెట్ పెట్టుకున్న వాహనదారులకు తనిఖీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు మాత్రం జరిమానాతో పాటు వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తనిఖీ చేసి, పత్రాలు లేనిపక్షంలో అన్నింటికీ కలపి భారీగా జరిమానాలు విధించనున్నారు.