పౌల్ట్రీ రైతులకు పవర్ సబ్సిడీ, ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ లో సహకారం : మంత్రి తలసాని

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 06:38 AM IST
పౌల్ట్రీ రైతులకు పవర్ సబ్సిడీ, ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ లో సహకారం : మంత్రి తలసాని

హైదరాబాద్ లోని మాదాపూర్‌ హైటెక్స్‌లో 13వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పౌల్ట్రీ ఇండ్రస్ట్రీని డెవలప్ కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని..పౌల్ట్రీ రైతులకు పవర్ సబ్సిడీ, ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ లో ప్రభుత్వం సహకారం అందిస్తోందని మంత్రి తెలిపారు.  
ఈ ఇండ్రస్ట్రీకి సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ మంత్రి వర్గంతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారని..దీంట్లో భాగంగా..డిసెంబర్ 2న సబ్ కమిటీతో సీఎం కేసీఆర్ సమావేశామవుతారని తెలిపారు. దేశంలో పౌల్ట్రీ రంగానికి మంచి భవిష్యత్‌ ఉందని రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

దేశంలోనే అత్యుత్తమ పౌల్ట్రీ విధానం తీసుకువస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణలో పౌల్ట్రీ రంగం పలువురికి ఉపాధి కల్పిస్తోందన్నారు. కోళ్ల రైతులకు ఎటువంటి సమస్య లేకుండా చూస్తామని ని మంత్రి తలసాని హామీ ఇచ్చారు.