మెట్రోస్టేషన్లో ప్రమాదంపై అక్టోబరు 3న బహిరంగ విచారణ

  • Edited By: chvmurthy , September 25, 2019 / 04:02 AM IST
మెట్రోస్టేషన్లో ప్రమాదంపై అక్టోబరు 3న బహిరంగ విచారణ

హైదరాబాద్ అమీర్ పెట్ మెట్రో స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు పరిశీలించారు. ఇటీవల ఓ పిల్లర్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపడి మహిళ మృతి చెందటంతో నిర్మాణాల్లోని భద్రతా,నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్రో స్టేషన్ లో రైళ్ల రాకోపోకలు,ట్రాక్ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుమతులు తప్పని సరి. అప్పట్లో అన్ని భద్రతా ప్రమాణాలు పరిశీలించాకే అమీర్ పేట మెట్రో స్టేషన్ కు అనుమతి మంజూరు చేశారు.  

కానీ ఇటీవల మహిళ మరణించిన ఘటనతో  పునః సమీక్షలో భాగంగా  సంఘటనా స్ధలాన్ని అధికారులు పరిశీలించారు. మెట్రో రైల్ సేఫ్టీ కమీషనర్  జేకే గార్గ్,  డిప్యూటీ కమీషనర్ రామ్ మోహన్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలు  సంఘటనా స్ధలాన్ని తనిఖీ చేశారు.  సిమెంట్ పిల్లర్ నుంచి పెచ్చులూడటానికి గలకారణాలను విశ్లేషించారు.

ఇంజనీరింగ్ లోపాలు, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని విమర్శలు వస్తున్నందున, పారదర్శకత కోసం అక్టోబరు3న బేగంపేట మెట్రోరైల్ భవన్ లో బహిరంగ విచారణ చేపట్టనున్నారు. నాణ్యత ప్రమాణాలపై  ఐఐటీ హైదరాబాద్ ఇంజనీరింగ్ పరీక్షలు జరపనుంది.