రెయిన్ ఎఫెక్ట్ : మెట్రో సర్వీసులకు అంతరాయం

హైదరాబాద్ ని వర్షాలు ముంచెత్తాయి. వానలు దంచి కొడుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 25,2019) నగర వ్యాప్తంగా కుండపోత వర్షం పడింది. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 03:21 PM IST
రెయిన్ ఎఫెక్ట్ : మెట్రో సర్వీసులకు అంతరాయం

హైదరాబాద్ ని వర్షాలు ముంచెత్తాయి. వానలు దంచి కొడుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 25,2019) నగర వ్యాప్తంగా కుండపోత వర్షం పడింది. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ ని వర్షాలు ముంచెత్తాయి. వానలు దంచి కొడుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 25,2019) నగర వ్యాప్తంగా కుండపోత వర్షం పడింది. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాల్లో వెళితే ఇబ్బందులు తప్పవని భావించి నగరవాసులు మెట్రో పై పడ్డారు. అయితే రెయిన్ ఎఫెక్ట్ మెట్రో సర్వీసులపైనా పడింది. మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఎల్బీనగర్ నుంచి అమీర్ పేట్ టు మియాపూర్ రూట్ లో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. 40 నిమిషాల పాటు సర్వీసులు నిలిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బుధవారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురవడంతో ప్రజల ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, బాలానగర్, పంజాగుట్ట, బేగంపేట్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, సుల్తాన్ బజార్, పాతబస్తీ, మలక్ పేట్, బోరబండ, మోతీనగర్, ఈఎస్ఐ, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. 

రెండు రోజులగా హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మంగళవారం(సెప్టెంబర్ 24,2019) రికార్డ్ స్థాయిలో కురిసిన వాన నగరవాసులను బెంబేలెత్తించింది. వెన్నులో వణుకు పుట్టించింది. బుధవారం కూడా వర్షం తన ప్రతాపాన్ని చూపించింది. ఎక్కడ చూసినా రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఉద్యోగులు ఆఫీస్ నుంచి ఇంటికి పయనమయ్యే సమయానికి కుండపోత వర్షం కురవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వర్షం నీరు ప్రవేశించి అవస్థలు పడుతున్నారు. వర్షం పడుతున్న తీరు చూస్తే.. ఆకాశానికి చిల్లు పడిందా అనే సందేహం కలగకమానదు. వరుణుడు హైదరాబాద్ నగరంపై పగబట్టాడా అనే అనుమానం వస్తుంది.