Rains in telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే, 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Rains in telangana: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం

Heavy Rains In Telangana

Rains in telangana: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పలు ప్రాంతాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, అలాగే, 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతుందని చెప్పారు. దానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పియర్ స్థాయి వరకు విస్తరించి ఉందని తెలిపారు. దీంతో అది రాగల 24 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని, దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరలోని వాయవ్య దిశగా ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరానికి చేరుకుంటుందని వివరించారు. కాగా, హైదరాబాద్ సహా తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Asaduddin Owaisi slams nitish kumar: ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తోన్న నితీశ్, మమతపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు