Raja Singh On PD Act: నేడు హైకోర్టును ఆశ్రయించనున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల వ్యవహారంలో పోలీసులు తన‌పై నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసుపై హైదరాబాద్ లోని గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హైకోర్టును ఆశ్రయించునున్నారు. నిన్న మ‌ధ్యాహ్నం రాజాసింగ్‌ను ఆయ‌న ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న మంగ‌ళ్ హాట్, షాహినాయ‌త్ గంజ్ పోలీసులు నాంప‌ల్లి కోర్టుకు త‌ర‌లించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజాసింగ్‌కు జ్యుడీషియ‌ల్ రిమాండ్ లో ఉన్నారు.

Raja Singh On PD Act: నేడు హైకోర్టును ఆశ్రయించనున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh On PD Act

Raja Singh On PD Act: వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల వ్యవహారంలో పోలీసులు తన‌పై నమోదు చేసిన పీడీ యాక్ట్ కేసుపై హైదరాబాద్ లోని గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హైకోర్టును ఆశ్రయించునున్నారు. నిన్న మ‌ధ్యాహ్నం రాజాసింగ్‌ను ఆయ‌న ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న మంగ‌ళ్ హాట్, షాహినాయ‌త్ గంజ్ పోలీసులు నాంప‌ల్లి కోర్టుకు త‌ర‌లించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజాసింగ్‌కు జ్యుడీషియ‌ల్ రిమాండ్ లో ఉన్నారు.

తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సారిగా ఓ ప్రజాప్రతినిధిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం ఇదే తొలిసారి. రాజాసింగ్ పై మొత్తం కలిపి 101 కేసులు నమోదయ్యాయి. ఓ మతాన్ని కించపరిచేలా వాఖ్యలు చేసినందుకు 18 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తనపై పెట్టిన పీడీ యాక్ట్ కేసు తొలగించాలని రాజాసింగ్ హైకోర్టుకు వెళ్ళనున్నారు.

ఈ మేరకు ఇవాళ హైకోర్టులో రాజాసింగ్ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. పీడీ యాక్ట్ నమోదు చేస్తే మూడు నెలల వరకు ఎలాంటి బెయిల్ మంజూరు కాదు. ఒక్కో సారి సంవత్సరం వరకు బెయిల్ రాదు. ప్రభుత్వానికి ఉన్న విచక్షణ అధికారంతో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీడీ యాక్ట్ ను అమల్లోకి తెచ్చింది.

Viral video: కొడుకుని ఎత్తుకుని రిక్షా తొక్కుతున్న తండ్రి.. కన్నీరు పెట్టిస్తోన్న వీడియో