నా సినిమా ఆపడానికి ప్రయత్నించిన వారిని వదలను : వర్మ

తమ సినిమాను ఆపడానికి చాలామంది ప్రయత్నించారని... వారి వివరాలన్నీ త్వరలోనే బయటపెడతానన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన అమ్మ

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 03:08 AM IST
నా సినిమా ఆపడానికి ప్రయత్నించిన వారిని వదలను : వర్మ

తమ సినిమాను ఆపడానికి చాలామంది ప్రయత్నించారని… వారి వివరాలన్నీ త్వరలోనే బయటపెడతానన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన అమ్మ

తమ సినిమాను ఆపడానికి చాలామంది ప్రయత్నించారని… వారి వివరాలన్నీ త్వరలోనే బయటపెడతానన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం గురువారం(డిసెంబర్ 12,2019) రిలీజ్‌ అయ్యింది. సెన్సార్‌ బోర్డ్‌ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో 1200 థియేటర్లలో విడుదల చేశారు.

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం విడుదలపై సస్పెన్స్‌ వీడింది. ఇవాళ(డిసెంబర్ 12,2019) సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంపై రివ్యూ కమిటీ, సెన్సార్‌ బోర్డు నిర్ణయం తీసుకోవాలని… తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చిత్ర విడుదలపై రివ్యూ కమిటీ, సెన్సార్‌ బోర్డుదే తుది నిర్ణయమని తేల్చేసింది. హైకోర్టు ఆదేశాలు, రివ్యూ కమిటీ నిర్ణయాన్ని పరిశీలించిన తర్వాత సెన్సార్‌బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీంతో విడుదలకు అడ్డంకులు తొలిగాయి.

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రం… అనుకున్నట్లే ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. రిలీజ్‌కు సంబంధించిన విషయాన్ని దర్శకుడు వర్మ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. సెన్సార్‌ బోర్డు సినిమాకు ఇచ్చిన సర్టిఫికెట్‌ను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

టైటిల్ విషయంలో వివాదాలు రావడంతో… కమ్మ రాజ్యంలో కడప రెడ్ల నుంచి… అమ్మరాజ్యంలో కడప బిడ్డలుగా మార్చారు వర్మ. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన, జరగబోయే విషయాలను ఊహించి వర్మ ఈ సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయ్‌.

ఈ సినిమాలో పాత్రలు ఏపీలోని పొలిటికల్‌ లీడర్స్‌ను పోలి ఉండటంతో… చిత్రం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. వివాదాలకు దారి తీసే అంశాలు సైతం మూవీలో ఉండటంతో విడుదల అనంతరం ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.