శ్రీకూర్మం వెళ్లొచ్చిన చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన తాబేలు..భక్తితో సేవలందించిన స్వామి

  • Published By: nagamani ,Published On : October 9, 2020 / 10:14 AM IST
శ్రీకూర్మం వెళ్లొచ్చిన చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన తాబేలు..భక్తితో సేవలందించిన స్వామి

chinna jeeyar swamy feeds a tortoise in his ashram : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, హైందవ ప్రచారకర్త చినజీయర్ స్వామి ఆశ్రమంలోకి ఓ చిన్న తాబేలు పిల్ల వచ్చింది. దాన్ని గుర్తించిన స్వామి ఆ తాబేలు పిల్లకు సేవలందించారు. ఆయనే స్వయంగా ఆ తాబేలు పిల్లకు ఆహారం తినిపించారు.


కాగా..కొన్ని రోజుల క్రితం చినజీయర్ స్వామి ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో కొలువైన శ్రీకూర్మం క్షేత్రాన్ని దర్శించుకుని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని తమ ఆశ్రమానికి వచ్చారు. ఆయన శ్రీకూర్మం వెళ్లి వచ్చిన కొన్ని రోజులకే తన ఆశ్రమానికి తాబేలు (కూర్మావతారం) రావటాన్ని శ్రీ చినజీయర్ స్వామి విస్మయానికి గురయ్యారు. ఆనందం వ్యక్తంచేశారు.


తన ఆశ్రమానికి సాక్షాత్తూ ఆ స్వామియే కూర్మావతారంలో వచ్చాడని భావించిన చినజీయర్ స్వామి ఆ తాబేలును ఎంతో జాగ్రత్తగా సంరక్షిస్తూ, స్వయంగా ఆయనే దానికి ఆహారం తినిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆశ్రమ వర్గాలు విడుదల చేశాయి.