తప్పనిసరి తిప్పలు : నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్..ఎంతైనా ఓకే 

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 06:25 AM IST
తప్పనిసరి తిప్పలు : నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్..ఎంతైనా ఓకే 

హైదరాబాద్ : అందరికీ సొంతగా ఇళ్లు కట్టుకోవటం సాధ్యం కాదు. అందుకు అద్దె ఇళ్ల మీదనే ఆధారపడుతుంటాం. మరోవైపు ఇంటి అద్దెలు రేటు హడలెత్తిస్తున్నాయి. అయినా సరే తప్పనిసరి పరిస్థితి..మెట్రో నగరాలకు ఎంతమంది ఉపాధి కోసం వస్తుంటారు. ఈ క్రమంలో అద్దెకు ఇళ్లు తీసుకోవటం తప్ప వేరే దారి లేదు. ఈ క్రమంలో అద్దెకు ఇళ్లు దొరకటం కష్టమే అవుతోంది. ఒకవేళ దొరికినా..అద్దె బాదుడు మామూలుగా ఉండటంలేదు..
 

మెట్రో నగరాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ ఎంతలా ఉందనే విషయంపై మకాన్ డాట్ కామ్ అనే వెబ్‌పోర్టల్ సర్వేలో వెల్లడించిన వివరాలు తెలుసుకుందాం. మెట్రో నగరాల్లో అద్దె ఇళ్లకు రోజురోజుకు విపరీతమైన గిరాకీ పెరుగుతోందని..నెల అద్దె రూ.16 వేలై కాదు ఎంతైనా చెల్లించేందుకు ఉద్యోగులు వెనకాడడం లేదని తెలిపింది. విద్యార్థులు కూడా రూ.11 వేల నుంచి రూ15 వేల  వరకు చెల్లించేందుకు ముందుకొస్తున్నారని సంస్థ పేర్కొంది.అది కూడా ఇల్లు ఎలా ఉన్నాసరే..సర్ధుకుపోయేందుకు రెడీ అయిపోతు..అడ్వాన్స్ లు కూడా భారీగానే ఇస్తున్నారనీ తెలిపింది.

అద్దె ఇళ్ల కోసం వెతుకుతున్న వారిలో 69 శాతం మంది ఉద్యోగులు కాగా..16 శాతం స్వయం ఉపాధి కోసం నగరానికి వచ్చినవారనీ..అలాగే 15 శాతం మంది విద్యార్థులు..చదువు కోసం..స్పెషల్ కోర్సులు చేసేందుకు..కోచింగ్ ల కోసం.. నగరానికి వచ్చినవారున్నారని వెల్లడించింది. 40 శాతం మంది ఉద్యోగులు పదివేల రూపాయల లోపు అద్దె ఉన్న ఇళ్ల కోసం వెతుకుతుండగా, మరో 40 శాతం మంది ఇల్లు దొరికితే చాలని, రూ.25 వేలైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని వెబ్‌పోర్టల్ తెలిపింది.