కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు పునరుద్ధరణ

కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైలును పునరుద్ధరించారు. 2020, ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఎన్‌.సీతారామ ప్రసాద్‌ తెలిపారు. కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 3.10 నిమిషాలకు బయలుదేరుతోంది.

  • Published By: veegamteam ,Published On : January 28, 2020 / 02:07 AM IST
కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు పునరుద్ధరణ

కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైలును పునరుద్ధరించారు. 2020, ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఎన్‌.సీతారామ ప్రసాద్‌ తెలిపారు. కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 3.10 నిమిషాలకు బయలుదేరుతోంది.

కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైలును పునరుద్ధరించారు. 2020, ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఎన్‌.సీతారామ ప్రసాద్‌ తెలిపారు. కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 3.10 నిమిషాలకు బయలుదేరుతోంది. సోమవారం హైదరాబాద్‌ డీఆర్‌ఎం మాట్లాడుతూ రైల్వే ప్రయాణికుల కోసం మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి గుంటూరు రైల్వేస్టేషన్‌ పరిసర ప్రాంతాల్లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు రైల్వే పనులను ఆధునీకరించినట్లు తెలిపారు.
 
కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతిరోజు 3.10 బయలుదేరే గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కాచిగూడ నుంచి కర్నూల్‌, డోన్‌, నంద్యాల, గిద్దలూర్‌, నర్సరావుపేట మీదుగా గుంటూరు వెళ్లడానికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాచిగూడ – గుంటూరు మధ్య 57305, 57306 నెంబర్లతో నడుస్తున్న ప్యాసింజర్‌ రైలును ఫిబ్రవరి 2 నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైలుగా మార్చి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ప్యాసింజర్‌ రైలును ఎక్స్‌ప్రె్‌సగా మార్చి 17251, 17252 నెంబర్లతో నడపనున్నారు. ఇందులో ఒక త్రీ ఏసీ కోచ్‌, 6 స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లు, 9 జనరల్‌ కంపార్టుమెంట్లు, రెండు లగేజీ వ్యాన్‌లతో ఉంటాయి. ఫిబ్రవరి 1 నుంచి 17251 గుంటూరు – కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలు రాత్రి 7 గంటలకు గుంటూరులో బయలుదేరి అర్ధరాత్రి 12.05 గంటలకు నంద్యాలకు చేరుకుంటుంది.

నంద్యాల నుంచి అర్ధరాత్రి 12.10కి బయలుదేరి ఉదయం 9.45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. అలాగే కాచిగూడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17252) రైలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కాచిగూడలో మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి నంద్యాలకు అర్ధరాత్రి 12.05 గంటలకు చేరుకుంటుంది. నంద్యాల నుంచి అర్ధరాత్రి 12.10 గంటలకు బయలుదేరి ఉదయం 6.45 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది.