తప్పిన ముప్పు : రైల్వేస్టేషన్ లో ప్రయాణికురాలిని కాపాడిన ఆర్పీఎఫ్ జవాన్

హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికురాలికి పెను ప్రమాదం తప్పింది. రైలు నుంచి జారిపడిన మహిళను ఆర్పీఎఫ్ జవాన్ రక్షించాడు.

  • Published By: veegamteam ,Published On : December 21, 2019 / 10:25 AM IST
తప్పిన ముప్పు : రైల్వేస్టేషన్ లో ప్రయాణికురాలిని కాపాడిన ఆర్పీఎఫ్ జవాన్

హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికురాలికి పెను ప్రమాదం తప్పింది. రైలు నుంచి జారిపడిన మహిళను ఆర్పీఎఫ్ జవాన్ రక్షించాడు.

హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికురాలికి పెను ప్రమాదం తప్పింది. రైలు నుంచి జారిపడిన మహిళను ఆర్పీఎఫ్ జవాన్ రక్షించాడు. ధన్ పూర్ ఎక్స్ ప్రెస్ లో డోర్ దగ్గర నిలబడిన మహిళ కాలు జారి కింద పడబోయింది. ఫ్లాట్ ఫామ్, రైలు మధ్య సందులో మహిళ చిక్కుకుంది. 

అదే సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ జవాన్ వెంటనే అప్రమత్తమై మహిళను రక్షించారు. పరుగెత్తుకుంటూ వెళ్లి కిందపడిన మహిళను ఫ్లాట్ ఫామ్ మీదకు లాగాడు. దీంతో ఆమె తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన మూడు రోజుల క్రితం జరిగింది. ఆర్పీఎఫ్ జవాన్ ను అందరూ అభినందించారు.
 

గతంలో దేశంలోని పలు చోట్ల రైలు నుంచి ప్రయాణికులు జారి పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ఘనటనల్లో రైలు నుంచి జారి పడిన ప్రయాణికులు మరణించారు. మరికొన్ని ఘటనల్లో ప్రయాణికులు రక్షించబడ్డారు. అందుకే ప్రయాణికులు రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని రైల్వే అధికారులు తెలిపారు. స్టేషన్ నుంచి కదులుతున్న రైలును ఎక్కవద్దని, స్టేషన్ లోకి వస్తున్న రైలు ఆగిన తర్వాతే ప్రయాణికులు దగాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.