1 crore seizure: హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ వద్ద పాత సామాను సేకరించే వ్యక్తి నుంచి రూ.1.24 కోట్లు స్వాధీనం

 అతడు బతకడానికి హైదరాబాద్ వచ్చి పాత సామన్లు సేకరించే వ్యాపారం చేసుకుంటున్నాడు. అతడి వద్ద అతి భారీగా డబ్బు ఉందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. అతడి వద్ద దొరికన డబ్బు చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ వద్ద పోలీసులకు తనిఖీల్లో రూ.1.24 కోట్లు పట్టుబడ్డాయి. ఇంత భారీ మొత్తంలో డబ్బు పట్టుబడడం సంచలనంగా మారింది. అది హవాలా డబ్బు అని పోలీసులు గుర్తించారు.

1 crore seizure: హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ వద్ద పాత సామాను సేకరించే వ్యక్తి నుంచి రూ.1.24 కోట్లు స్వాధీనం

1 crore seizure: అతడు బతకడానికి హైదరాబాద్ వచ్చి పాత సామన్లు సేకరించే వ్యాపారం చేసుకుంటున్నాడు. అతడి వద్ద అతి భారీగా డబ్బు ఉందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. అతడి వద్ద దొరికన డబ్బు చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ వద్ద పోలీసులకు తనిఖీల్లో రూ.1.24 కోట్లు పట్టుబడ్డాయి. ఇంత భారీ మొత్తంలో డబ్బు పట్టుబడడం సంచలనంగా మారింది. అది హవాలా డబ్బు అని పోలీసులు గుర్తించారు.

మాసబ్ ట్యాంక్ లోని శాంతి నగర్ లో షోయబ్ మాలిక్ అనే వ్యక్తి వద్ద ఈ డబ్బు దొరికిందని వివరించారు. అతడు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నుంచి ఇక్కడకు ఉపాధి కోసం వచ్చాడని పోలీసులు వివరించారు. హైదరాబాద్ లో పాత సామాను సేకరించే వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. అతడిని బంధువు చేసిన సూచన మేరకు భరత్ అనే వ్యక్తి వద్ద నగదు తీసుకున్నాడని తెలిపారు. ఆ హవాలా డబ్బు గురించి పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. పాత సామాన్లు సేకరించే వ్యాపారం చేస్తున్న వ్యక్తి వద్ద డబ్బు ఉంటే ఎవరికీ అనుమానం రాదని హవాలా ముఠా సభ్యులు ప్లాన్లు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి..