9ఏళ్లలో 100 కోట్ల ఉద్యోగాలు : బయోటెక్ స్టార్టప్‌ కంపెనీలకు రూ.400 కోట్లు

హైదరాబాద్ : బయోటెక్ (జీవశాస్త్ర) సంబంధిత స్టార్టప్‌ కంపెనీలకు కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) అండగా నిలిచింది. ఆర్థిక సాయం చేసింది. రూ.400

  • Published By: veegamteam ,Published On : April 14, 2019 / 05:59 AM IST
9ఏళ్లలో 100 కోట్ల ఉద్యోగాలు : బయోటెక్ స్టార్టప్‌ కంపెనీలకు రూ.400 కోట్లు

హైదరాబాద్ : బయోటెక్ (జీవశాస్త్ర) సంబంధిత స్టార్టప్‌ కంపెనీలకు కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) అండగా నిలిచింది. ఆర్థిక సాయం చేసింది. రూ.400

హైదరాబాద్ : బయోటెక్ (జీవశాస్త్ర) సంబంధిత స్టార్టప్‌ కంపెనీలకు కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) అండగా నిలిచింది. ఆర్థిక సాయం చేసింది. రూ.400 కోట్లతో నిధిని ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ సి.మండే తెలిపారు. విధివిధానాల రూపకల్పనకు కసరత్తు జరుగుతోందని, సీఎస్‌ఐఆర్‌ సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న ఈ నిధికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకూ పంపించామని ఆయన చెప్పారు. సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలోని అటల్‌ ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా శనివారం(ఏప్రిల్ 13,2019) ఏర్పాటైన కార్యక్రమానికి శేఖర్‌ సి. మండే చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

బయోటెక్‌ స్టార్టప్‌ కంపెనీల కోసం ఏర్పాటు చేస్తున్న నిధి 2 నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశముందని మండే తెలిపారు. దేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాల సాయంతో పరిష్కారాలు కనుక్కునే లక్ష్యంతో ఐదేళ్ల క్రితం కొన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందన్నారు. వాటి ఫలితాలిప్పుడు అందరికీ అందుతున్నాయని తెలిపారు. సికిల్‌ సెల్‌ అనీమియా వంటి అరుదైన వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించేందుకు సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ జన్యు ఆధారిత టెక్నాలజీని అభివృద్ధి చేశామని మండే చెప్పారు.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పండే చెరకు నుంచి మరింత విలువను రాబట్టేందుకు భావ్‌నగర్‌లోని సీఎస్‌ఐఆర్‌ సంస్థ ఓ వినూత్న టెక్నాలజీని ఆవిష్కరించిందని శేఖర్‌ తెలిపారు. వృథాగా పోతున్న వ్యర్థాల నుంచి పొటాష్‌ను వెలికితీయగల ఈ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పొటాష్‌ దిగుమతులను నిలిపివేయచ్చని ఆయన చెప్పారు. ఇన్ కుబేషన్ సెంటర్లు, స్టార్టప్ కంపెనీల పరిశ్రమ పెద్ద ఎత్తున విస్తరిస్తోందని… 2028 నాటికి దేశంలో ఈ పరిశ్రమ ద్వారా 100 కోట్ల ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.